పురిటి నొప్పులు.. అత్యవసరంగా విమానం ల్యాండింగ్!

సడన్‌గా విమానంలో ఓ యువతికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో.. ఖతార్ ఎయిర్‌వేస్ క్యూఆర్-830 విమానం కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దోహా నుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న విమానంలో ఓ నిండు గర్భిణి ప్రయాణిస్తోంది. థాయ్‌లాండ్‌కి చెందిన ఆమెకి ఈ రోజు తెల్లవారుజామున విమానంలో పురిటినొప్పులు మొదలయ్యాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది వైద్య సేవల నిమిత్తం అత్యవసర ల్యాండిగ్ చేయాలని నిర్ణయించారు. దీంతో కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ చేసి, వెంటనే వైద్యులను సంప్రదించారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న […]

పురిటి నొప్పులు.. అత్యవసరంగా విమానం ల్యాండింగ్!
Follow us

| Edited By:

Updated on: Feb 04, 2020 | 8:17 PM

సడన్‌గా విమానంలో ఓ యువతికి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో.. ఖతార్ ఎయిర్‌వేస్ క్యూఆర్-830 విమానం కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దోహా నుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న విమానంలో ఓ నిండు గర్భిణి ప్రయాణిస్తోంది. థాయ్‌లాండ్‌కి చెందిన ఆమెకి ఈ రోజు తెల్లవారుజామున విమానంలో పురిటినొప్పులు మొదలయ్యాయి. అప్రమత్తమైన విమాన సిబ్బంది వైద్య సేవల నిమిత్తం అత్యవసర ల్యాండిగ్ చేయాలని నిర్ణయించారు. దీంతో కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ చేసి, వెంటనే వైద్యులను సంప్రదించారు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వారు.. గర్భిణికి పురుడు పోశారు. ఓ పండంటి మగ బిడ్డకు థాయ్ మహిళ జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అనంతరం వారిని ఓ స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.