కరాచి విమాన ప్రమాదంలో పైలట్ చివరి మాటలు ఇవే…

దేశమంతా రంజాన్ మాసం చివరి శుక్రవారం రోజున మధ్యాహ్నం ప్రార్థనలు ముగించుకుంది. అదే సమయంలో కనీవిని ఎరుగని విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన ఘోర విమాన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది.

  • Pardhasaradhi Peri
  • Publish Date - 11:52 am, Sat, 23 May 20
కరాచి విమాన ప్రమాదంలో పైలట్ చివరి మాటలు ఇవే...

దేశమంతా రంజాన్ మాసం చివరి శుక్రవారం రోజున మధ్యాహ్నం ప్రార్థనలు ముగించుకుంది. అదే సమయంలో కనీవిని ఎరుగని విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగిన ఘోర విమాన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ప్రమాదంజరగడానికి ముందు పైలట్ ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.

సంభాషణ ఇలా ఉంది…
పీకే8303 పైలట్: అప్రోచ్
ఏటీసీ: జీ సర్
పైలట్: మేం ఎడమవైపు తిరగాలా?
ఏటీసీ: ఒకే (ధృవీకరణ)
పైలట్: మేం డైరెక్టుగా వెళుతున్నాం. రెండు ఇంజన్లను కోల్పోయాము.
ఏటీసీ: మీరు బెల్లీ ల్యాండింగ్ (గేర్-అప్ ల్యాండింగ్) చేస్తున్నారని నిర్ధారించండి?
పైలట్: వినిపించడంలేదు.
ఏటీసీ: ల్యాండింగ్ కోసం 2- 5 రన్‌వే అందుబాటులో ఉంది
పైలట్: రోజర్
పైలట్: సర్, మేడే, మేడే, మేడే, పాకిస్తాన్ 8303
ఏటీసీ: పాకిస్తాన్ 8303, రోజర్ సర్. రెండు రన్‌వేలు అందుబాటులో ఉన్నాయి.
అంతే ఇక్కడితో ఆడియో కట్ అయిపోయింది. ఆ వెంటనే రాడార్‌తో సంబంధాలు తెగిపోయి విమానం కూలిపోయింది. ఇది వారి మధ్య జరిగిన చివరి సంభాషన అంతే.. ఇక అతని మాటలు వినిపించలేదు.. మరో క్షణంలో పెద్ద శబ్ధం.. ఆకాలంలో మంటలు ఎయిర్ పోర్ట్‌కు సమీపంలోని జనావాసాలపై విమానం కుప్పకూలిపోయింది.

అయితే పైలట్ చివరి సారి మేడే.. మేడే.. మేడే..(రక్షించండి…ప్రమాదంలో ఉన్నాము) అంటూ చెప్పిన వెంటనే ఏటీసీ అధికారులు రంగంలోకి దిగాలి… కాని అలా జరగలేదు.

తర్వాత కొన్ని క్షణాలకే విమానం ఓ మొబైల్ టవర్‌ను ఢీకొట్టి జనావాసాల్లో కుప్పకూలింది. రెండు రన్‌వేలు సిద్ధంగా ఉన్నాయని చెప్పినా పైలట్ గో-రౌండ్ (గాల్లో చక్కర్లు కొట్టేందుకే) మొగ్గు చూపాడని ఏటీసీ అధికార ప్రతినిధి అబ్దుల్లా హెచ్.ఖాన్ తెలిపారు.