తుళ్లూరులో లాఠీచార్జ్.. మందడంలో ఉద్రిక్తత..

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా తుళ్లూరులో హై టెన్షన్ నెలకొంది. తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి పాదయాత్రగా బయల్దేరిన మహిళలను.. ఆ గ్రామ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. అయితే మేమంతా అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నామని.. ప్రభుత్వంపై కోట్లాడేందుకు కాదని.. తమను వదిలేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. అయితే పాదయాత్రలకు, ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని.. మీరు చేపట్టిన ఈ పాదయాత్రను విరమించుకోవాలని మహిళలకు పోలీసులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య […]

  • Updated On - 1:56 pm, Fri, 10 January 20 Edited By:
తుళ్లూరులో లాఠీచార్జ్.. మందడంలో ఉద్రిక్తత..


ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా తుళ్లూరులో హై టెన్షన్ నెలకొంది. తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి పాదయాత్రగా బయల్దేరిన మహిళలను.. ఆ గ్రామ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. అయితే మేమంతా అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నామని.. ప్రభుత్వంపై కోట్లాడేందుకు కాదని.. తమను వదిలేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. అయితే పాదయాత్రలకు, ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని.. మీరు చేపట్టిన ఈ పాదయాత్రను విరమించుకోవాలని మహిళలకు పోలీసులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకున్నా.. వారిని కాదని ముందుకు వెళ్లారు కొందరు రైతులు, మహిళలు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో పలువురు మహిళలు, రైతులకు స్వల్ప గాయాలయ్యాయి. శుక్రవారం అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లాలంటే.. ప్రభుత్వం అనుమతి కావాలా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు.. మందడంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామ దేవత పోలేరమ్మకు నైవేద్యం పెట్టేందుకు వెళ్తుండగా.. గుడి సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. గుడి చుట్టూ.. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆలయంలోకి వెళ్లేందుకు ఎవర్నీ కూడా అనుమతించడంలేదు. దీంతో అక్కడి మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తొపులాట జరిగింది. అమ్మవారికి నైవేధ్యం పెట్టేందుకు పోలీసుల అనుమతి కావాలా అంటూ మహిళలు మండిపడ్డారు. అసలు ఏపీలో ఉన్నామా లేక పాకిస్తాన్‌లో ఉన్నామా అంటూ పోలీసులను ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌, 30 యాక్టు అమల్లో ఉందని పోలీసులు మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మందడం గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసుల బలగాలు మోహరించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది.