నవజాత శిశువుల మృతి దారుణం, మహారాష్ట్ర ఘటనపై ప్రధాని మోదీ షాక్, కుటుంబ సభ్యులకు సంతాపం

మహారాష్ట్రలోని భండారా జిల్లాలో గల  ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో 10 మంది నవజాత శిశువుల మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • Umakanth Rao
  • Publish Date - 10:37 am, Sat, 9 January 21
నవజాత శిశువుల మృతి దారుణం, మహారాష్ట్ర ఘటనపై ప్రధాని మోదీ షాక్, కుటుంబ సభ్యులకు సంతాపం

మహారాష్ట్రలోని భండారా జిల్లాలో గల  ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో 10 మంది నవజాత శిశువుల మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన అత్యంత దారుణమని, విలువైన జీవితాలు నాశనమయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన  సంతాపం తెలిపారు. ఈ ఆసుపత్రిలో  17 మంది శిశువులను  చేర్చారు. పొగతో ఉక్కిరిబిక్కిరై శ్వాస ఆడక వీరిలో 10 మంది మరణించారు. ఏడుగురు శిశువులను రక్షించారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. షార్ట్ సర్క్యూట్ ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే  దీనిపై విచారణకు ఆదేశించారు. కాగా…. హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా ఈ ఘటనపట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ ట్వీట్లు చేశారు.