Sirivennela Sitarama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థత.. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స

Sirivennela Sitarama Sastry: ప్రముఖ తెలుగు సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం హైద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో..

Sirivennela Sitarama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థత.. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స
Sirivennela Sitarama Sastry
Follow us

|

Updated on: Nov 27, 2021 | 9:05 PM

Sirivennela Sitarama Sastry: ప్రముఖ తెలుగు సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స నిమిత్తం హైద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.  గత రెండు రోజుల క్రితం  సీతారామశాస్త్రి అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం కిమ్స్ కి చెందిన ప్రముఖ వైద్యులు సీతారామశాస్త్రికి చికిత్సనందిస్తున్నారు.. సీతారామ శాస్త్రి అనారోగ్య విషయం తెలియగానే ఒక్కసారిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉల్కిపడింది. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ నటీనటులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియల్సీ ఉంది.

1986లో సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా తెలుగు తెరపై అడుగు పెట్టిన చేంబోలు సీతారామశాస్త్రి గత దశాబ్దాలుగా తెలుగు సినిమాకు పాటల రచయితగా సేవలను అందిస్తున్నారు.  మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకుని సిరివెన్నెల సీతారామశాస్త్రిగా పేరుగాంచారు. మొదటి సినిమా సిరివెన్నెలతోనే ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డుని అందుకున్నారు. అలా మొదలైన సీతారాశాస్త్రి సినీ జర్నీలో ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. అంకురం, గాయం వంటి సినిమాల్లో నటించి.. అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. అచ్చ తెనుగు నుడికారంతో బలమైన పదజాలంతో పాటలు రాస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టంది. 2019లో భారతదేశ పురస్కారం పద్మశ్రీ లభించింది. శ్రుతిలయలు, స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ పాట లిరిక్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.. సిరివెన్నెల సీతారామశాస్త్రి త్వరగా కోలుకోవాలని, టాలీవుడ్ ఇండస్ట్రీ తోపాటు ఆయన పాటల అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read:   కృత్రిమ మొసలి అనుకుని.. దానిపై చేయివేసి ఓ వృద్ధుడు సెల్ఫీకి యత్నం.. మరణం అంచువరకూ వెళ్లి వచ్చిన వైనం..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు