తెలుగు భాషను ఎంపిక చేసుకుంటే 5 మార్కులు అదనం

తెలుగు భాషకు పట్టం కట్టింది. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు తెలుగు భాషను ఐచ్ఛిక అంశంగా...

  • Sanjay Kasula
  • Publish Date - 6:10 pm, Fri, 17 July 20
తెలుగు భాషను ఎంపిక చేసుకుంటే 5 మార్కులు అదనం

మాత‌ృభాషపై తెలుగువారికి చేవచ్చిపోయినా.. ఎక్కడో ఉన్న ఓ దేశం మాత్రం తేనె లొలుకు తెలుగును తలకెక్కించుకుంది. అంతేకాదు తెలుగు భాషకు పట్టం కట్టింది. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు తెలుగు భాషను ఐచ్ఛిక అంశంగా ఎంపిక చేసుకొనే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదు.. తెలుగు భాషను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకొన్న వారికి ఉత్తీర్ణతలో 5 పాయింట్‌లు అదనంగా కల్పుతోంది.

మధురమైన తెలుగుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. చదువులోనే కాకుండా అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్లు శాశ్వత నివాసం కోసం కూడా తెలుగు భాష ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్‌ అక్రిడిటేషన్‌ అథారిటీ ఫర్‌ ట్రాన్సిలేటర్స్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటర్స్‌ (నాటి) నిర్వహించే పరీక్ష రాసేవారికి కూడా తెలుగుకు 5 పాయింట్లు అదనంగా కలుస్తాయి.

ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు హిందీ, పంజాబీ,తమిళ భాషలకు అక్కడి ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది. అయితే ఇప్పుడు తాజాగా 4వ భాషగా తెలుగు ఆ గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం. దీంతో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ, విక్టోరియా, న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్, సౌత ఆస్ట్రేలియాతోపాటు మరిన్ని రాష్ట్రాల్లో  రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి ప్రయోజనం లభించనుంది.