TCongress Leaders Arrested: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు, చమురు ధరల పెంపు పై టీ కాంగ్రెస్ నేతలు ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టారు. రాజ్ భవన్ ముట్టడి కోసం వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. లుంబినీ పార్క్ నుంచి ర్యాలీగా వెళ్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తమ్, భట్టి, కోమటి రెడ్డి, వీహెచ్, పొన్నాల , జీవన్ రెడ్డి, అంజాన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నేతల ఘోరావ్ ను అడ్డుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేయడంతో కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.
Also Read: వైద్య వృత్తిని వ్యాపార కళ నుంచి వేరుచేసి. రోగులకు సేవలను అందించిన డాక్టర్ శాంతి ఇక లేరు