గల్ఫ్‌లో తెలంగాణ బిడ్డల నరకం

కరోనా దెబ్బతో గల్ఫ్‌లో తెలంగాణ కార్మికులు అష్ట కష్టాలు పడుతున్నారు. పనులు లేక క్యాంపులకే పరిమితమవుతున్నారు. తిండి లేక, చేతిలో మనీ లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వందల మంది ఉంటున్న క్యాంపుల్లో సరిగ్గా కరోనా టెస్ట్‌లు చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గల్ఫ్‌లో తెలంగాణ బిడ్డల నరకం
Follow us

|

Updated on: May 02, 2020 | 2:53 PM

కరోనా దెబ్బతో గల్ఫ్‌లో తెలంగాణ కార్మికులు అష్ట కష్టాలు పడుతున్నారు. పనులు లేక క్యాంపులకే పరిమితమవుతున్నారు. తిండి లేక, చేతిలో మనీ లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వందల మంది ఉంటున్న క్యాంపుల్లో సరిగ్గా కరోనా టెస్ట్‌లు చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ ఉన్న వాళ్లను కూడా తమతోనే కలిపి ఉంచుతున్నారని ఆవేదన చెందుతున్నారు. వేరేచోటికి వెళ్ళేందుకు అనుమతించడం లేదని చెబుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి అనేకమంది దుబాయ్‌తోపాటు పలు గల్ఫ్ దేశాలలో దుర్భర జీవితం గడుపుతున్నారని.. వారికి కరోనా వైరస్‌ సోకినా వైద్యం అందించటం లేదని తెలంగాణ ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రుద్ర శంకర్ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని కరోనా బారిన పడ్డ తెలంగాణ బిడ్డలను రక్షించాలని రుద్రశంకర్ కోరారు. కేసీఆర్, కేటీఆర్‌లు కూడా గల్ఫ్ బాధితుల విషయంలో చొరవ చూపించాలని వారిని ఆదుకోవాలని విఙ్ఞప్తి చేశారు.