ఇకపై ఆన్‌లైన్‌లోనే ఫ్యాన్సీ నెంబర్లు…

Telangana Transport System New Policy: ఈ మధ్యకాలంలో సామాన్యుల దగ్గర నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు అందరూ కూడా ఫ్యాన్సీ నెంబర్లు కొనుగోలు చేయడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. కోట్లు ఖర్చుపెట్టి కారు కొనడమే కాకుండా.. దానికి తగ్గట్టుగా పది లక్షలు పోసి మరీ ఫ్యాన్సీ నెంబర్లను కొనుగోలు చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వీటి డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. సిరీస్ వచ్చిన ప్రతీసారి ప్రజలు కొత్త నెంబర్ల కోసం పోటీపడుతున్నారు. ఇక దీనితో […]

ఇకపై ఆన్‌లైన్‌లోనే ఫ్యాన్సీ నెంబర్లు...
Follow us

|

Updated on: Jan 30, 2020 | 2:42 PM

Telangana Transport System New Policy: ఈ మధ్యకాలంలో సామాన్యుల దగ్గర నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు అందరూ కూడా ఫ్యాన్సీ నెంబర్లు కొనుగోలు చేయడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. కోట్లు ఖర్చుపెట్టి కారు కొనడమే కాకుండా.. దానికి తగ్గట్టుగా పది లక్షలు పోసి మరీ ఫ్యాన్సీ నెంబర్లను కొనుగోలు చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వీటి డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. సిరీస్ వచ్చిన ప్రతీసారి ప్రజలు కొత్త నెంబర్ల కోసం పోటీపడుతున్నారు. ఇక దీనితో రవాణా శాఖ కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది.

ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 9999తో ఒక కొత్త ఫ్యాన్సీ నెంబర్‌ను విడుదల చేస్తే అది కొనడానికి ఒక వ్యక్తి ఏకంగా 10 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇక న్యూమరాలజీ, లక్కీ నెంబర్ల మీద పిచ్చి ఉన్నవాళ్ళ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త వాహనం కొంటే చాలు.. వాళ్ళ చూపు ఫ్యాన్సీ నెంబర్ వైపే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖ, గుంటూరు నగరాల్లో జనాలు ఎక్కువగా ఈ ఫ్యాన్సీ నెంబర్ల వైపు మొగ్గు చూపుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రవాణాశాఖ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ను ప్రారంభించనుంది. ఈ విధానం ఫిబ్రవరి 10 నుంచి అందుబాటులోకి రానుంది.

  • తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్టేటస్ ఆఫ్ రిజిస్ట్రేషన్లపై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఆప్షన్‌ను ఎంచుకుంటే.. ఆయా కార్యాలయం పరిధిలో ఉండే నెంబర్లు అన్ని కనబడతాయి.
  • ఇక వాటిల్లో మీకు నచ్చిన నెంబర్‌ను ఎంపిక చేసి నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోర్టల్ అందుబాటులో ఉంటుంది.
  • ఇక చివరి నిమిషంలోపు మీరు ఎంచుకున్న నెంబర్‌కు ఒక్క అప్లికేషన్ మాత్రమే వస్తే.. ఆటోమేటిక్‌గా ఆ నెంబర్ మీకే కేటాయించబడుతుంది.
  • ఒకవేళ ఒకటికి కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మాత్రం గడువు పూర్తయ్యేలోపు బిడ్స్ వేయాల్సి వస్తుంది.
  •  ఆ బిడ్స్‌లో ఎవరిది ఎక్కువ మొత్తం ఉంటుందో ఆటోమేటిక్‌గా వారికి ఆ నెంబర్‌ను కేటాయిస్తారు
  • కాగా, ఈ బిడ్స్ మధ్యాహ్నం 3 గంటల వరకు చెల్లించవచ్చు.
  • అటు తక్కువ బిడ్ వేసిన వారికి మాత్రం.. వారి మొత్తం అమౌంట్ తిరిగి మళ్ళీ జమ అవుతుంది

దళారుల జోక్యం, అంతేకాకుండా ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపులో అవకతవకలు జరగకుండా ఉండటానికి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలంగాణ రవాణాశాఖ మంత్రి స్పష్టం చేశారు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..