Telangana : టీచర్లకు గుడ్ న్యూస్..

తెలంగాణ హైకోర్టు టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.  ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో టీచరుగా జాయినింగ్ రిపోర్టు ఇచ్చిన తేదీ నుంచి సర్వీసు బెనిఫిట్స్ లెక్కించి ఇవ్వాలని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Telangana : టీచర్లకు గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Feb 23, 2020 | 6:05 PM

Telangana :  తెలంగాణ హైకోర్టు టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.  ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో టీచరుగా జాయినింగ్ రిపోర్టు ఇచ్చిన తేదీ నుంచి సర్వీసు బెనిఫిట్స్ లెక్కించి ఇవ్వాలని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎంప్లాయికి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ చెల్లింపులను సర్వీసులో చేరిన రోజు నుంచే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ విషయంలో కూడా ఇదే పద్దతి వర్తిస్తుందని తీర్పు ప్రతిలో పేర్కొంది. రెండు నెలల్లోపు వారికి చెల్లింపులు చేయాలని అధికారులను జడ్జి  ఆదేశించారు.

సికింద్రాబాద్‌లో ఉన్న సెయింట్ ఆన్స్ గర్ల్స్ పాఠశాలలో.. స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసి రిటైరైన సుమిత్ర, మరికొందరు వేసిన కేసులో హైకోర్టు జడ్జి అమర్నాథ్ గౌడ్ శనివారం ఈ తీర్పు వెలువరించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ పోస్టుల్లో 1959-65 సమయంలో విధుల్లో చేరిన తమకు.. 10, 15, 20 ఏళ్ల  సర్వీసు ఇంక్రిమెంట్, పెన్షన్ బెనిఫిట్స్ పొందేందుకు అధికారులు అనుమతివ్వట్లేదని వారు కోర్టు మెట్లు ఎక్కారు.  అయితే  గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ నుంచి సదరు స్కూలును గవర్నమెంట్ తొలగించడంతో సర్వీస్ రూల్స్ తమకు వర్తించదని మేనేజ్‌మెంట్ వాదించింది. కాని ఎట్టకేలకు కోర్టు తీర్పు మాత్రం ఉద్యోగుల పక్షానే వచ్చింది.

ఇది కూడా చదవండి : గుడ్ న్యూస్..తిరుపతి నుంచి తిరుమలకు మోనో రైలు..!