దేశంలోని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు?

దేశంలోని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు మంత్రి టి హరీష్ రావు శుక్రవారం తెలిపారు. బెజ్జంకి లోని వ్యవసాయ కమిటీ భవనాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం తరువాత హరీష్ మాట్లాడుతూ ఢిల్లీ లో జరిగిన ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆర్థిక మందగమనం, ఆర్థిక క్రమశిక్షణపై చర్చించినట్లు చెప్పారు. ఆర్థిక స్వాతంత్రం సాధించడానికి వీలుగా మహిళల స్వయం సహాయక […]

దేశంలోని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు?
Follow us

| Edited By:

Updated on: Dec 20, 2019 | 4:11 PM

దేశంలోని మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు మంత్రి టి హరీష్ రావు శుక్రవారం తెలిపారు. బెజ్జంకి లోని వ్యవసాయ కమిటీ భవనాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం తరువాత హరీష్ మాట్లాడుతూ ఢిల్లీ లో జరిగిన ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆర్థిక మందగమనం, ఆర్థిక క్రమశిక్షణపై చర్చించినట్లు చెప్పారు. ఆర్థిక స్వాతంత్రం సాధించడానికి వీలుగా మహిళల స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలు కోరినట్లు ఆయన తెలిపారు. పాడి రంగ అవకాశాలపై దృష్టి పెట్టాలని హరీష్ ఈ ప్రాంత మహిళలను కోరారు. నీటి లభ్యతపై మాట్లాడుతూ రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించారు. ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్, జెడ్‌పి చైర్‌పర్సన్ రోజా శర్మ, సర్పంచ్ డి మంజుల తదితరులు పాల్గొన్నారు.