తెలంగాణ‌ సచివాలయం కూల్చివేత అప్ డేట్…

తెలంగాణ‌ సచివాలయం కూల్చివేతకు న్యాయపరమైన చిక్కులు తొల‌గడంతో...శుక్ర‌వారం నుంచి కూల్చివేత ప‌నులు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. సచివాలయంలో మొత్తం 11 కొండు బిల్డింగులు ఉన్నాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 7:59 am, Sat, 18 July 20
తెలంగాణ‌ సచివాలయం కూల్చివేత అప్ డేట్...

ఈ నెల 6వ తేది నుంచి ప్రారంభ‌మైన‌ తెలంగాణ‌ సచివాలయం కూల్చివేత ప‌నులు..హైకోర్టు ఆదేశాల‌తో గ‌త వారం రోజులుగా ఆగిపోయిన విష‌యం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు, హైకోర్టుల నుంచి తెలంగాణ‌ సచివాలయం కూల్చివేతకు న్యాయపరమైన చిక్కులు తొల‌గడంతో…శుక్ర‌వారం నుంచి కూల్చివేత ప‌నులు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. సచివాలయంలో మొత్తం 11 బిల్డింగులు ఉన్నాయి. కోర్టుల‌ తీర్పుల‌తో కోవిడ్ ప్రమాణాలు పాటిస్తూ కూల్చివేత పక్రియ‌లు జ‌రుగుతున్నాయి. సి, జే బ్లాక్ లతో పాటు అమ్మవారి గుడి, మజీద్, స్టోన్ బిల్డింగ్ కూల్చివేత ప్రక్రియ దాదాపు పూర్తియ్యింది. కాగా ఇప్ప‌టికే నూతన సచివాలయం నిర్మాణానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ భూమి పూజ చేసిన సంగ‌తి తెలిసిందే. 11నెలల్లో నూతన సచివాలయం పూర్తి చెయ్య‌డానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.