ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి రిజిస్ట్రేషన్లు మొదలు..మళ్లీ స్టాంప్‌ పేపర్లపైనే.. ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పని సరి..

ఇవాళ్టి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే జరపనున్నారు. కొత్తగా చేపట్టిన స్లాట్‌ బుకింగ్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటికే స్లాట్‌ బుక్ చేసుకున్న వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్లు...

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి రిజిస్ట్రేషన్లు మొదలు..మళ్లీ స్టాంప్‌ పేపర్లపైనే.. ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పని సరి..
Follow us

|

Updated on: Dec 21, 2020 | 1:43 AM

Telangana Registration : ఇవాళ్టి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే జరపనున్నారు. కొత్తగా చేపట్టిన స్లాట్‌ బుకింగ్ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటికే స్లాట్‌ బుక్ చేసుకున్న వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విషయంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్‌ 8 కంటే ముందు ఉన్న పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం నుంచి అన్ని జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పాత పద్ధతిలోనే నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

రిజిస్ట్రేషన్ల విధానాన్ని సమూలంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌ 8 నుంచి ప్రక్రియను నిలిపి వేసింది. సంస్కరణల్లో భాగంగా ధరణి వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించింది.

ధరణి ద్వారా వ్యవసాయ భూములు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ నెల 14 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించారు. కార్డు పద్ధతిలోనే ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా వ్యవసాయ భూముల మాదిరిగా ముందుగా స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని ఇందులో కొత్తగా ప్రవేశ పెట్టారు. ఇపుడు ఈ ప్రక్రియను కూడా రద్దు చేసిన ప్రభుత్వం పూర్తిగా పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?