రాజాసింగ్ మెడకు ‘దిశ’ కేసు.. ఎందుకంటే?

రాజాసింగ్ మెడకు ‘దిశ’ కేసు.. ఎందుకంటే?

తెలంగాణలో బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ బయోడేటాలో మరో కేసు చేరింది. అయితే ఈసారి ఆయన ఏ ధర్నా చేసినందుకో.. ఎవరిని అబ్యూజ్ చేసినందుకో కాదు… ‘దిశ’ కేసులో నోటీసులందుకుంటున్న వారి జాబితాలో రాజా సింగ్‌ కూడా చేరారు. అదేంటి దిశ కేసుకు రాజాసింగ్‌కు ఏంటీ సంబంధం అనుకుంటున్నారా? రీడ్ దిస్ స్టోరీ.. రాజాసింగ్.. తెలంగాణలో బిజెపి తరపున పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. గోషామహల్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాసింగ్.. తనకు తాను […]

Rajesh Sharma

|

Dec 04, 2019 | 6:01 PM

తెలంగాణలో బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ బయోడేటాలో మరో కేసు చేరింది. అయితే ఈసారి ఆయన ఏ ధర్నా చేసినందుకో.. ఎవరిని అబ్యూజ్ చేసినందుకో కాదు… ‘దిశ’ కేసులో నోటీసులందుకుంటున్న వారి జాబితాలో రాజా సింగ్‌ కూడా చేరారు. అదేంటి దిశ కేసుకు రాజాసింగ్‌కు ఏంటీ సంబంధం అనుకుంటున్నారా? రీడ్ దిస్ స్టోరీ..

రాజాసింగ్.. తెలంగాణలో బిజెపి తరపున పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. గోషామహల్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాసింగ్.. తనకు తాను హిందువులకు ఏకైక ప్రతినిధిని అనుకుంటుంటారని అందరూ చెప్పుకుంటుంటారు. హైదరాబాద్‌లో ఎం.ఐ.ఎం. పార్టీకి ధీటైన జవాబిచ్చే లీడర్ ఎవరంటే ఎవరైనా ఠక్కున రాజాసింగ్ పేరు చెబుతారు. అలాంటి రాజాసింగ్ ఇప్పుడు దిశ కేసులో పోలీసు నోటీసులందుకున్నారు.

దిశ కేసు వెలుగులోకి వచ్చిన మొదటి రెండు రోజులు అందరు ఆమె అసలు పేరును ప్రస్తావిస్తూ.. ఆమె ఫోటోను చూపిస్తూ వార్తలు రాసినవారే.. సంఘటనను ఖండించిన వారే. రెండ్రోజుల తర్వాత పోలీసులు.. అప్పుడే తమకు గుర్తొచ్చినట్లు మృతురాలి అసలు పేరు వాడొద్దని.. ఆమె పేరును ప్రస్తావించాల్సి వస్తే ‘దిశ’ అనే పేరును వాడుకోవాలని ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజానికి మొదటి రెండ్రోజులు సంఘటనను ఖండించిన నేతలు, ఆఖరుకు రాష్ట్ర మంత్రులు కూడా మృతురాలి అసలు పేరునే ప్రస్తావించారు. మీడియాతో మాట్లాడిన పోలీసు అధికారులు కూడా ఆమె అసలు పేరునే ప్రస్తావించారు.

అయితే.. ఇప్పుడు మృతురాలి అసలు పేరును ప్రస్తావించిన ప్రతీ ఒక్కరికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరారు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్. మీడియాకు, వెబ్‌సైట్లకు, కొంత మంది లీడర్లకు నోటసులిస్తున్న పోలీసులు.. మృతురాలి పేరు ప్రస్తావించిన అధికారులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇతర నాయకులకు కూడా నోటీసులిస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu