బట్టబయలైన నేతల బాగోతం!..రాజా సింగ్ అందులో టాప్!!

రాజకీయ నాయకులు అలవికాని హామీలిస్తూ… గద్దెనెక్కాలని చూస్తుంటారు. ఆ ప్రయత్నాల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా తాయిలాలతో ప్రభావితం చేసి అనుకున్నది సాధిస్తారు. అధికార పగ్గాలు చేపట్టేందుకు కొందరు.. నేరమయ చరిత్రను దాచుకునేందుకు మరికొందరు రాజకీయాల వైపు దృష్టిసారిస్తున్నారు. ఇవీ ప్రతి ఎన్నికల్లో వెలుగుచూసేవే. అయితే  ప్రజల కోసం, ప్రజా సమస్కలపై పోరాటం చేస్తూ కేసులు నమోదైతే పరువాలేదు కానీ..ఇప్పుడు చెప్పబోయే తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేల జాబితా అందుకు పూర్తి విరుద్దం. వివిధ ఉద్యమాల్లో నమోదైన కేసులు కొట్టివేయగా […]

బట్టబయలైన నేతల బాగోతం!..రాజా సింగ్ అందులో టాప్!!
Follow us

|

Updated on: Sep 19, 2019 | 9:08 PM

రాజకీయ నాయకులు అలవికాని హామీలిస్తూ… గద్దెనెక్కాలని చూస్తుంటారు. ఆ ప్రయత్నాల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా తాయిలాలతో ప్రభావితం చేసి అనుకున్నది సాధిస్తారు. అధికార పగ్గాలు చేపట్టేందుకు కొందరు.. నేరమయ చరిత్రను దాచుకునేందుకు మరికొందరు రాజకీయాల వైపు దృష్టిసారిస్తున్నారు. ఇవీ ప్రతి ఎన్నికల్లో వెలుగుచూసేవే. అయితే  ప్రజల కోసం, ప్రజా సమస్కలపై పోరాటం చేస్తూ కేసులు నమోదైతే పరువాలేదు కానీ..ఇప్పుడు చెప్పబోయే తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేల జాబితా అందుకు పూర్తి విరుద్దం. వివిధ ఉద్యమాల్లో నమోదైన కేసులు కొట్టివేయగా మనవాళ్లపై ఇంకా కేసులు మిగిలే ఉన్నాయి.  కాగా నేరచరిత్ర కలిగిన ఎమ్మెల్యే ,ఎంపీల కేసుల విచారణకు తెలంగాణలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసింది సుప్రీం. అయినా కూడా కేసులు విషయంలో సత్వర చర్యలు ఉండటం లేదు. తాజాగా ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐ చట్టం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీ, ఎంపీలపై నమోదైన కేసుల వివరాలు తెలుసుకుంది. ఆ వివరాలు టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా మీముందుంచింది

తెలంగాణలో ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కేసులు విషయంలో ముందున్నారు. ఆయనపై 17 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి

కాంగ్రెస్ ఎంపీ  రేవంత్ రెడ్డి : 7 కేసులు

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ : 6 కేసులు

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి : 5 కేసులు

టీఆర్‌ఎస్ నేత తాటికొండ రాజయ్య : 5 కేసులు

కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ : 4 కేసులు

మాజీ స్పీకర్ మధుసూధనా చారి : 3 కేసులు

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ : 3 కేసులు

మంత్రి తలసాని : 3 కేసులు

టీఆర్‌‌ఎస్ నేత జూపల్లి కృష్ణా రావు : 3 కేసులు

టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న : 3 కేసులు

మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య : 3 కేసులు నమోదు