పద్మప్రియకు మంత్రి సబిత కితాబు

భారత్ - అమెరికా టీచింగ్ ఎక్సలెన్సీ అండ్ అచీవ్ మెంట్ కార్యక్రమానికి పద్మప్రియ ఎంపికవ్వడం గర్వకారణమన్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నైతిక విలువలు పెంపొందించడానికి..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 6:58 pm, Tue, 25 August 20
పద్మప్రియకు మంత్రి సబిత కితాబు

భారత్ – అమెరికా టీచింగ్ ఎక్సలెన్సీ అండ్ అచీవ్ మెంట్ కార్యక్రమానికి పద్మప్రియ ఎంపికవ్వడం గర్వకారణమన్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నైతిక విలువలు పెంపొందించడానికి ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అద్వితీయమని ఆమె అభిప్రాయపడ్డారు. అమెరికా బోధనా పద్ధతులను స్థానికంగా అనుసరించి సత్ఫలితాలు సాధించడం మంచి పరిణామమని సబిత తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అనిర్వచనీయమన్న సబిత.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బోధనా పద్ధతులను మారుస్తూ సత్ఫలితాలు సాధించాలిని సూచించారు. మంత్రితోపాటు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు 2020కి ఎంపికైన పద్మప్రియను స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్ర రామచంద్రన్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్ అభినందించారు.