కరోనావైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పెడుతోన్న ఇబ్బందులు అన్నీ,ఇన్నీ కాదు. ఈ మహమ్మారి వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఎక్కడనుంచి సాయం కోసం అభ్యర్థించిన..వారికి చేదోడుగా నిలుస్తున్నారు మంత్రి కేటీఆర్, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవిత చేసిన ట్వీట్లు.. సౌతాఫ్రికాలో సాయం కోసం ఎదురుచూస్తోన్నవారికి ఊరటనిచ్చాయి. టీఆర్ఎస్ సౌతాఫ్రికా ప్రెసిడెంట్ గుర్రాల నాగరాజును కేటీఆర్, కవిత ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేసి సమస్కలను వివరించారు. దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమను ఆదుకోవాలని రవితేజ అనే తెలంగాణ ప్రవాస ఉద్యోగి మంత్రి కేటీఆర్‌ను ట్విటర్ ద్వారా కోరారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ఆ ఫ్యామిలీని ఆదుకోవాలని టీఆర్‌ఎస్ సౌతాఫ్రికా శాఖ అధ్యక్షుడు నాగరాజుకు సూచించారు.
కేటీఆర్ సూచన మేరకు నాగరాజు వారి దగ్గరకు వెళ్లి వారికి 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. ఇక మరోవైపు సౌతాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమను ఆదుకోవాలని మాజీ ఎంపీ కవితకు యాద కిరణ్ అనే నెటిజన్ కోరారు. సమస్యను నాగరాజు… కాన్సులెట్ ఆఫ్ ఇండియా జోహన్నెస్‌బర్గ్ దృష్టికి తీసుకెళ్లారు.
I am sorry to hear about your situation so far away from home
Request TRS South Africa leader @TRSNagaraju to kindly assist https://t.co/pAN6MRxCsn
— KTR (@KTRTRS) April 28, 2020