జ‌న‌సేనానిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రశంసించారు. క‌రోనా కార‌ణంగా దేశ‌మంతా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో చెన్నై హార్బర్‌లో చిక్కుకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారుల తరఫున వాయిస్ ని వినిపించిన జ‌నసేనానిని గవర్నర్ తమళసై ట్విట్ట‌ర్ ద్వారా అభినందించారు. పవన్ అభ్య‌ర్థ‌న‌పై తమళనాడు ప్రభుత్వం కూడా అంతే వేగంగా స్పందించడం గొప్ప విష‌య‌మ‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. వారి పోరాటాల‌కు దేవుడు ఎప్పుడూ స‌హ‌రిస్తాడని ఆశీస్సులు అంజేశారు. గ‌వ‌ర్న‌ర్ ట్వీట్ పై ప‌వ‌న్ […]

  • Ram Naramaneni
  • Publish Date - 11:05 am, Tue, 31 March 20
జ‌న‌సేనానిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రశంసించారు. క‌రోనా కార‌ణంగా దేశ‌మంతా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో చెన్నై హార్బర్‌లో చిక్కుకుపోయిన శ్రీకాకుళం మత్స్యకారుల తరఫున వాయిస్ ని వినిపించిన జ‌నసేనానిని గవర్నర్ తమళసై ట్విట్ట‌ర్ ద్వారా అభినందించారు. పవన్ అభ్య‌ర్థ‌న‌పై తమళనాడు ప్రభుత్వం కూడా అంతే వేగంగా స్పందించడం గొప్ప విష‌య‌మ‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. వారి పోరాటాల‌కు దేవుడు ఎప్పుడూ స‌హ‌రిస్తాడని ఆశీస్సులు అంజేశారు.

గ‌వ‌ర్న‌ర్ ట్వీట్ పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. ఆమె ప్ర‌శంస ద్వారా భ‌విష్య‌త్ లో మ‌రింత‌మంది నిస్సాయ‌కుల‌కు అండ‌గా నిలిచేలా స్ఫూర్తి క‌లిగింద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ కు పవ‌న్..వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు సీఎం పళనిస్వామికి మీ ద్వారా తన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాన‌ని ట్వీట్ చేశారు.