తెలంగాణ: గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్… నిధులు విడుద‌ల‌

తెలంగాణ ప్ర‌భుత్వం గ్రామ పంచాయ‌తీల‌కు శుభ‌వార్త చెప్పింది. రాష్ట్ర‌వ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీలకు రూ.308 కోట్లు రిలీజ్ చేసింది. గ్రామాల్లో ఇప్పుడు కరోనా వ్యాప్తి నియంత్రణ ప‌నులు, పారిశుధ్య పనులు వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయి. స‌ర్పంచుల యొక్క ప‌నితీరును ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే. అందుకే ప‌నులు ఆగిపోకుండా..కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు రాకపోయినా కూడా రాష్ట్ర‌ప్ర‌భుత్వం మంజూరు చేసింది. జనాభాతో సంబంధం లేకుండా అవ‌స‌రాన్ని బ‌ట్టీ ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.3 లక్షలు […]

  • Ram Naramaneni
  • Publish Date - 9:11 am, Wed, 15 April 20
తెలంగాణ: గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్... నిధులు విడుద‌ల‌

తెలంగాణ ప్ర‌భుత్వం గ్రామ పంచాయ‌తీల‌కు శుభ‌వార్త చెప్పింది. రాష్ట్ర‌వ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీలకు రూ.308 కోట్లు రిలీజ్ చేసింది. గ్రామాల్లో ఇప్పుడు కరోనా వ్యాప్తి నియంత్రణ ప‌నులు, పారిశుధ్య పనులు వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయి. స‌ర్పంచుల యొక్క ప‌నితీరును ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే. అందుకే ప‌నులు ఆగిపోకుండా..కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు రాకపోయినా కూడా రాష్ట్ర‌ప్ర‌భుత్వం మంజూరు చేసింది.

జనాభాతో సంబంధం లేకుండా అవ‌స‌రాన్ని బ‌ట్టీ ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.3 లక్షలు నుంచి రూ.7 లక్షల వరకు ఇవ్వనుంది ప్ర‌భుత్వం. వాస్త‌వానికి, కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు… రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి ప్రతి నెల రూ.308 కోట్లు ఇవ్వాలి. కానీ కేంద్ర ఆర్థిక సంఘం జూన్‌ వరకు నిధులు ఇచ్చే అవకాశం లేక‌పోవ‌డ‌వంతో.. మొత్తం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే రిలీజ్ చేసింది.