Telangana Government: దేశంలో వ్య‌వ‌సాయానికి అత్య‌ధికంగా ఖ‌ర్చుచేస్తున్న రాష్ట్రం తెలంగాణ‌… మంత్రి హ‌రీష్ రావు…

దేశంలో వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక నిధులు ఖర్చు ‌చేస్తున్న రాష్ట్రం‌ తెలంగాణ మాత్రమేనని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం..

  • Gandu Raju
  • Publish Date - 1:17 pm, Sat, 23 January 21
Telangana Government: దేశంలో వ్య‌వ‌సాయానికి అత్య‌ధికంగా ఖ‌ర్చుచేస్తున్న రాష్ట్రం తెలంగాణ‌... మంత్రి హ‌రీష్ రావు...

దేశంలో వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక నిధులు ఖర్చు ‌చేస్తున్న రాష్ట్రం‌ తెలంగాణ మాత్రమేనని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంపై ఏటా రూ.35 వేల కోట్లు వెచ్చిస్తున్నదని తెలిపారు. అందరికీ సంఘాలున్నప్పటికీ రైతులకు మాత్రం లేవని చెప్పారు. రైతులను సంఘటితం చేయాలన్నది సీఎం ఆకాంక్ష అని వెల్లడించారు.

ఆరు నెల‌ల్లోనే క‌రెంటు స‌మ‌స్య తీర్చేశాం…

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు మండలం నందిగామలో రైతువేదిక, షాపింగ్‌ కాంప్లెక్స్‌ను మంత్రి హ‌రీష్ రావు ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల్లోనే కరెంటు సమస్యను పరిష్కరించామని చెప్పారు. ప్రాజెక్టులు నిర్మించడంతో ఇప్పుడు కరెంటు ఉన్నా లేకున్నా రెండు పంటలు పండించే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చారని చెప్పారు. అనంతరం పఠాన్‌చెరు టౌన్‌లో గాంధీ థీమ్ పార్కుకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ.1.6 కోట్లతో పార్కును నిర్మిస్తున్నామని చెప్పారు.