మున్సిపాలిటీల్లో ‘రెవిన్యూ మేళాలు’.. శ్రీకారం చుట్టనున్న సర్కార్..

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

మున్సిపాలిటీల్లో 'రెవిన్యూ మేళాలు'.. శ్రీకారం చుట్టనున్న సర్కార్..
Follow us

|

Updated on: Aug 24, 2020 | 1:45 AM

Revenue Mela In Municipalites: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాపర్టీ ట్యాక్స్, ఇతరత్రా రెవిన్యూ విభాగంలోని సమస్యలపై ప్రతీ సోమవారం, బుధవారం మున్సిపాలిటీల్లో రెవిన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అవకాశాన్ని సెప్టెంబర్ 15 వరకు కల్పిస్తుండగా.. ప్రతీ ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రెవిన్యూ సదస్సులు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మున్సిపల్ కార్యాలయంలో జరుగుతాయంది.

రెవిన్యూ మేళాకు తీసుకురావాల్సిన పత్రాలు…

  • డోర్ నెంబర్ కోసం: అసెస్మెంట్ కాపీ
  • పేరు మార్పుకు: మ్యుటేషన్ కాపీ /రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్లు
  • ఇల్లు తీసేసినట్టయితే ఇంటి పన్ను రద్దు కోసం: ఫోటో, చివరిగా కట్టిన ఇంటి పన్ను రశీదు.
  • ఇంటి పన్ను ఎక్కువ వచ్చినట్లయితే : అసెస్మెంట్ కాపీ, ఇంటి ఫోటో, సంబంధిత డాక్యూమెంట్లు
  • డబుల్ అసెస్మెంట్ అయితే : ఇంటి పర్మిషన్, అసెస్మెంట్ నంబర్స్, మొదటగా కట్టిన ఇంటి పన్ను రశీదు తేవాలి.