తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల

గత నెలలో జరిగిన ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలు విడుదల అయ్యాయి.

తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల
Follow us

|

Updated on: Oct 06, 2020 | 5:04 PM

గత నెలలో జరిగిన ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. జేఎన్‌టీయూలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ పాపిరెడ్డి, ఎంసెట్ క‌న్వీన‌ర్ గోవ‌ర్ధ‌న్‌తో పాటు ప‌లువురు హాజ‌ర‌య్యారు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో 89,734 మంది(75.29 శాతం) ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌లితాల కోసం www.eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. ఈ ఏడాది ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌కు 1,43,326 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, 1,19,183 మంది ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. మొత్తంగా 89,734 మంది ఉత్తీర్ణ‌త సాధించారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం నాలుగు రోజులపాటు ఆన్‌లైన్‌ ద్వారా అధికారులు ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందుకోసం మొత్తం 102 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అందులో 79 తెలంగాణలో, 23 పరీక్షా కేంద్రాలు ఏపీలో ఉన్నాయి.

మొదటి పది ర్యాంకులు సాధించిన విద్యార్థలుః

ఫస్ట్ ర్యాంక్ – సాయి తేజ వారణాసి

సెకండ్ ర్యాంక్ యశ్వంత్ సాయి

థర్డ్ ర్యాంక్ తమ్మనబోయిన మణి వేంకట కృష్ణ

నాల్గో ర్యాంక్ చాగరి కౌశల్ కుమార్ రెడ్డి

ఐదో ర్యాంక్ అత్రిక్ రాజ్ పాల్ (జేఈఈ తొలి ర్యాంకర్ తెలంగాణ)

ఆరో ర్యాంక్ నాగెల్లి నితిన్ సాయి

ఏడో ర్యాంక్ ఈవీఎన్.వి.ఎస్. కృష్ణ కమల్

8వ ర్యాంక్ అన్నమ్ సాయి వర్ధన్

తొమ్మిదో ర్యాంక్ సాయి పవన్ హర్ష వర్ధన్

పదో ర్యాంక్ వారణాసి వచిన్ సిద్దార్థ్

ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ఈ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తొలివిడత ప్రక్రియ ఈనెల 9 నుంచి ప్రారంభమై 27న ముగియనుంది. చివరివిడత ప్రక్రియ ఈనెల 29 నుంచి నవంబరు 5 వరకు ఉంటుంది. ప్రైవేటు ఇంజనీరింగ్‌, బి-ఫార్మసీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను వచ్చే నెల 4న విడుదల చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ఎంసెట్‌ ఆలస్యం కావడంతో.. కౌన్సెలింగ్‌ను వీలైనంత త్వరలో పూర్తిచేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. 28 రోజుల్లోనే మొదటి, చివరి విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తికానుంది.

ప్రైవేటు ఇంజనీరింగ్‌, బి-ఫార్మసీ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్లకు సంబంఽధించిన మార్గదర్శకాలను వచ్చే నెల 4న విడుదల చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ఎంసెట్‌ ఆలస్యం కావడంతో.. కౌన్సెలింగ్‌ను వీలైనంత త్వరలో పూర్తిచేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. 28 రోజుల్లోనే మొదటి, చివరి విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తవనుండటం గమనార్హం.

మొదటి విడత కౌన్సెలింగ్‌:

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌: అక్టోబరు 9-17
  • స్లాట్‌ బుక్‌ చేసినవారి ధ్రువపత్రాల పరిశీలన: అక్టోబరు 12-18
  • పరిశీలన అనంతరం ఆప్షన్ల ఎంపిక: అక్టోబరు 12-20
  • ఫ్రీజింగ్‌ ఆఫ్‌ ఆప్షన్స్‌: అక్టోబరు 20 ఫ సీట్ల కేటాయింపు: అక్టోబరు 22
  • ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: అక్టోబరు 22-27
  • చివరివిడత కౌన్సెలింగ్‌:

ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌: అక్టోబరు 29

స్లాట్‌ బుక్‌ చేసినవారి ధ్రువపత్రాల పరిశీలన: అక్టోబరు 30

ఆప్షన్ల ఎంపిక: అక్టోబరు 30-31 ఫ ఫ్రీజింగ్‌ ఆఫ్‌ ఆప్షన్స్‌: అక్టోబరు-31

సీట్ల కేటాయింపు: నవంబరు-2

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!