మొక్కజొన్న రైతులకు ముఖ్యమంత్రి హెచ్చరిక

తెలంగాణ వ్యాప్తంగా వచ్చే యాసంగిలో మొక్కజొన్న పంట అస్సలే వేయొద్దని సూచిస్తున్నారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు. దేశంలో మొక్కజొన్న నిల్వలు అపారంగా పెరిగిపోయాయని..

మొక్కజొన్న రైతులకు ముఖ్యమంత్రి హెచ్చరిక
Follow us

|

Updated on: Oct 10, 2020 | 9:25 PM

తెలంగాణ వ్యాప్తంగా వచ్చే యాసంగిలో మొక్కజొన్న పంట అస్సలే వేయొద్దని సూచిస్తున్నారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు. దేశంలో మొక్కజొన్న నిల్వలు అపారంగా పెరిగిపోయాయని, విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు కూడా లేని కారణంగా వచ్చే సీజన్లో మొక్కజొన్న పంటలు అసలు వేయకుండా.. ప్రత్యామ్నాయ పంటలను ఆశ్రయించాలని ముఖ్యమంత్రి సూచించారు.

పంటల సాగు, మార్కెటింగ్ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కజొన్న పంట సాగు ఏ మాత్రం శ్రేయస్కరం కాదని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. యాసంగి కాలంలో మొక్కజొన్న సాగు వేసే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి విశదీకరించారు.

ఈ నేపథ్యంలో మరిన్ని అంశాలపై ముఖ్యమంత్రి వేసిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. ఇప్పటికే అవసరానికి మించి మొక్కజొన్న నిల్వలు ఉన్నాయని, అంతర్జాతీయ మార్కెట్లో అవసరాలకు పోను 28 కోట్ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న నిల్వలు దేశంలో ఉన్నాయని అధికారులు వివరించారు.

దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం దిగుమతి ఇ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.. మొక్కజొన్న పంట వేసే రైతులకు కనీస మద్దతు ధర లభించే అవకాశాలు సన్నగిల్లాయి అని అధికారులు తెలిపారు. ధర ఎంత తక్కువ వచ్చిన సరే అనుకునే రైతులు మాత్రమే మొక్కజొన్న పంట వేయడానికి సిద్ధపడాలి .. లాభాలు ఆశించే రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారుల అభిప్రాయాలతోను… గణాంకాలతోను… విశ్లేషించుకున్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తెలంగాణ రైతులు వచ్చే యాసంగిలో మొక్కజొన్న పంట వేయవద్దని సూచించారు.