మేడారంకు సీఎం కేసీఆర్.. పర్యటన ఖరారు

మేడారం జాతరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఖరారైంది. ఈ నెల 7వ తేదీన కుటుంబసమేతంగా కేసీఆర్ మేడారంలో పర్యటించనున్నారు. 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆయన సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునే అవకాశం ఉంది. అలాగే.. సీఎం రాక సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తును కూడా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా ఇప్పటికే మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ […]

మేడారంకు సీఎం కేసీఆర్.. పర్యటన ఖరారు

మేడారం జాతరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఖరారైంది. ఈ నెల 7వ తేదీన కుటుంబసమేతంగా కేసీఆర్ మేడారంలో పర్యటించనున్నారు. 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఆయన సమ్మక్క-సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునే అవకాశం ఉంది. అలాగే.. సీఎం రాక సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తును కూడా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

కాగా ఇప్పటికే మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. జాతర సందర్బంగా మేడారం మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. కోట్లాది మంది ప్రజలు వనదేవతలను దర్శించుకుని తరిస్తున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu