తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ రైతులకే రైతు బంధు..

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ రైతులకే రైతు బంధు..

ఇకపై రైతులు ఏ రకమైన పంటలు వేయాలో ప్రభుత్వం త్వరలోనే చెబుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వం చెప్పిన పంటలను సాగు చేసే రైతులకే రైతుబంధు ఇవ్వాలని.. వాటినే మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు పండించాలన్నారు. ఈ ఏడాది వరి పంటతోనే పంటల మార్పిడి మొదలు కావాలన్నారు. రాష్ట్రంలో పంటల మార్పిడి, పంటల కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి మంగళవారం ఉన్నతస్థాయి […]

Ravi Kiran

|

May 13, 2020 | 9:59 AM

ఇకపై రైతులు ఏ రకమైన పంటలు వేయాలో ప్రభుత్వం త్వరలోనే చెబుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వం చెప్పిన పంటలను సాగు చేసే రైతులకే రైతుబంధు ఇవ్వాలని.. వాటినే మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు పండించాలన్నారు. ఈ ఏడాది వరి పంటతోనే పంటల మార్పిడి మొదలు కావాలన్నారు.

రాష్ట్రంలో పంటల మార్పిడి, పంటల కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మీదట అందరూ ఒకే రకమైన పంటలు వేసే విధానాన్ని మార్చుకోవాలన్నారు. అంతా ఒకే పంట వేస్తే గిట్టుబాటు ధర రాదని, మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్లు పంటలు వేయాలన్నారు.

రైతులు ఏ పంట వేస్తే లభాపడతారన్న విషయాన్ని ప్రభుత్వమే చెబుతుందని.. ఇకపై విత్తనాలు ఆ పంటలకు సంబంధించినవే రాయితీపై అమ్మే విధంగా విత్తన తయారీ సంస్థలకు, వ్యాపారులకు ఆదేశాలిస్తామన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కొత్తగా సీడ్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే ఈ సంస్థ అందుబాటులో ఉంచుతుంది. ఈ అంశంపై చర్చించడానికి సీడ్ కంపెనీ ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమవుతారు.

Read This: కిమ్ లైఫ్‌స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu