డిసెంబర్‌ రెండోవారంలో హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల్లోని విపక్షనేతలతో కాన్‌క్లేవ్‌ : తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆసక్తికర ప్రకటన చేశారు. యావత్ దేశంలోని కార్మికులు, రైతాంగం పక్షాన ముందుండి పోరాటం చేస్తామంటున్న కేసీఆర్, డిసెంబర్‌ రెండోవారంలో హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల్లోని విపక్షనేతలతో కాన్‌క్లేవ్‌ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై త్వరలోనే దేశవ్యాప్త నిరసనకు టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతుందని చెప్పారు. డిసెంబర్‌ రెండోవారంలో జాతీయస్థాయిలోని […]

డిసెంబర్‌ రెండోవారంలో హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల్లోని విపక్షనేతలతో కాన్‌క్లేవ్‌ : తెలంగాణ సీఎం కేసీఆర్
Follow us

|

Updated on: Nov 19, 2020 | 6:41 PM

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆసక్తికర ప్రకటన చేశారు. యావత్ దేశంలోని కార్మికులు, రైతాంగం పక్షాన ముందుండి పోరాటం చేస్తామంటున్న కేసీఆర్, డిసెంబర్‌ రెండోవారంలో హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల్లోని విపక్షనేతలతో కాన్‌క్లేవ్‌ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై త్వరలోనే దేశవ్యాప్త నిరసనకు టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతుందని చెప్పారు. డిసెంబర్‌ రెండోవారంలో జాతీయస్థాయిలోని ప్రతిపక్ష పార్టీలన్నింటితో కలిసి హైదరాబాద్‌ కేంద్రంగా ఒక కాన్‌క్లేవ్‌ నిర్వహించబోతున్నట్టు స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించి ఆరున్నరేండ్లు గడిచినా దేశంలో జరిగిన అభివృద్ధి ఏమీలేదని, పైగా దేశం ఇప్పుడు తిరోగమనంలో నడుస్తున్నదని కేసీఆర్ అంటున్నారు.