లక్షకు పైగా బోనస్: సింగరేణి కార్మికునిదే ‘సిరి’

లక్షకు పైగా బోనస్: సింగరేణి కార్మికునిదే 'సిరి'

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దసరా కానుకగా.. వారిని లక్షాధికారిని చేసేశారు. ప్రతి కార్మికుడికి రూ.లక్షా 899 బోనస్‌ను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సారి లాభాల్లో వాటా 28 శాతానికి పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది కన్నా రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లించనుంది. కాగా 2018-19లో రూ.1,765కోట్ల లాభాన్ని సింగరేణి ఆర్జించింది. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. సింగరేణి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 19, 2019 | 12:58 PM

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దసరా కానుకగా.. వారిని లక్షాధికారిని చేసేశారు. ప్రతి కార్మికుడికి రూ.లక్షా 899 బోనస్‌ను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సారి లాభాల్లో వాటా 28 శాతానికి పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది కన్నా రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లించనుంది. కాగా 2018-19లో రూ.1,765కోట్ల లాభాన్ని సింగరేణి ఆర్జించింది. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 2013-14లో రూ.13,540 అడ్వాన్స్‌గా ఇచ్చామని.. ఐదేళ్లలో రూ.లక్షా 899 ఇచ్చే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. మొత్తానికి ఒక్కో సింగరేణి కార్మికుడికి ఈ సారి నెలకు లక్షన్నరకు పైగానే ముట్టబోతోంది. కేసీఆర్‌ ప్రకటనతో.. సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu