Telangana BJP: టీ.బీజేపీ నేతల్లో కొత్త మీమాంస… మిత్రుడా? ప్రత్యర్థా??

తెలంగాణ బీజేపీ నేతలకు ఒకటే టెన్షన్‌. కేసీఆర్‌కు వ్యతిరేకంగా తాము పోరాడుతుంటే..అటు జాతీయ నేతలు తమ ఆవేశంపై నీళ్లు చల్లారని గుర్రుగా ఉన్నారట. కేసీఆర్‌పై ఫైట్‌ ప్రారంభిస్తే...

Telangana BJP: టీ.బీజేపీ నేతల్లో కొత్త మీమాంస… మిత్రుడా? ప్రత్యర్థా??

Telangana BJP leaders fallen under new dilemma: తెలంగాణ బీజేపీ నేతలకు ఒకటే టెన్షన్‌. కేసీఆర్‌కు వ్యతిరేకంగా తాము పోరాడుతుంటే..అటు జాతీయ నేతలు తమ ఆవేశంపై నీళ్లు చల్లారని గుర్రుగా ఉన్నారట. కేసీఆర్‌పై ఫైట్‌ ప్రారంభిస్తే… ఒకే ఒక ఇన్విటేషన్‌‌తో జాతీయ నేతలు తమ పోరాటంపై నీళ్లు చల్లారని బాధపడుతున్నారట. ఇంతకీ తెలంగాణ బీజేపీ నేతల అసలు బాధేంటి?

తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు మళ్లీ ఆందోళనలో పడ్డారు. రాష్ట్రంలో తాము కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని అనుకునే లోపే కేంద్రం నిర్ణయం వారికి విఘాతంగా మారింది. ఇక్కడ కేసీఆర్‌పై ఇటీవల బీజేపీ నేతలు విమర్శల దాడిని పెంచారు. నాలుగు ఎంపీ సీట్లు, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతంతో మాటల యుద్ధం ప్రారంభించారు. ఈ లోపే కేంద్రం నిర్ణయం వారి ఆశలపై నీళ్లు చల్లింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్ధం రాష్ట్రపతి విందు ఇచ్చారు. ఈ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. దేశంలో 28 మంది సీఎంలు ఉంటే…కేవలం 8 మంది ముఖ్యమంత్రులకు విందు ఆహ్వానాలు అందాయి. కొంతమంది బీజేపీ పాలిత సీఎంలకు కూడా ఇన్విటేషన్‌ అందలేదు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానించడంపై బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదట. ఇక్కడ కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంటే….రాష్ట్రపతి భవన్‌ కేసీఆర్‌కు ఆహ్వానం పంపడంతో తాము కేసీఆర్‌పై చేసే విమర్శలు వర్క్‌వుట్‌ అయ్యే పరిస్థితి లేకుండా పోయిందని బాధపడుతున్నారట.

సీఎం కేసీఆర్‌ బీజేపీకి మిత్రుడో…శత్రువో తెలియని పరిస్థితి ఇప్పుడు బీజేపీలో నెలకొందట. సీఏఏను వ్యతిరేకిస్తూ కేబినెట్‌లో తీర్మానం చేశారు. కేసీఆర్‌ తమ వ్యతిరేకి అని…మజ్లిస్‌ ఎజెండా అమలు చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శలకు పదును పెట్టే టైమ్‌లోనే కేసీఆర్‌కు ఆహ్వానం అందడంతో బీజేపీ నేతలకు షాక్‌ గురయ్యారట. ఒక్కసారి కేసీఆర్‌కు చాన్స్‌ ఇస్తే.. కేంద్ర బీజేపీ నేతలకు దగ్గరవుతారట. దీంతో తమకు పని లేకుండా పోతుందని బీజేపీ నేతలు వాపోతున్నారట.

Read this: TRs leaders under new tension టీఆర్ఎస్ నేతల్లో కొత్త టెన్షన్