రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణ ఆడపడుచులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ కార్యక్రమం చెపడుతోంది కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్.

రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
Follow us

|

Updated on: Oct 08, 2020 | 1:04 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందించే చిరుకానుకలు వచ్చేశాయి.. తెలంగాణ ఆడపడుచులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ కార్యక్రమం చెపడుతోంది కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్. కరోనా నేపథ్యంలోనూ ఈ పంపిణీకి బ్రేక్‌ పడకుండా పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. తాజాగా..రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన కోటి మంది ఆడపడుచులకు రేపటి నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ చీరల పంపిణీ ప్రక్రియ 11వ తేదీ వరకు కొనసాగనుందని అధికారులు తెలిపారు.

సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ లో మరమగ్గాలపై చీరలను తయారు చేయించింది తెలంగాణ ప్రభుత్వం. మరమగ్గ నేతన్నలకు ఉపాది కల్పించటం..అదే సమయంలో అడపడుచులకు చిరు కానుక అందించటమే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. 287 డిజైన్లతో చేనేత మగ్గాలపై నేసిన చీరలు ఇప్పటికే రాష్ట్రంలోని 33 జిల్లాలకు చేరాయి. చీరల తయారీకి రూ.317 కోట్లు ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులే ఇంటింటికీ వెళ్లి చీరలను అందజేయనున్నారు. ఇళ్ల వద్ద తీసుకోలేని వారికి 12 నుంచి 15 వ తేదీ లోగా రేషన్‌ దుకాణాల ద్వారా చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది మొత్తం 98.50 లక్షల చీరలు అవసరమవుతాయని అంచనా వేసి అన్ని జిల్లాలకు చేరవేశారు అధికారులు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని పంపిణీకి సిద్ధం చేశారు.