రైతుల ఆత్మహత్యలు: ఏపీ @ 4, తెలంగాణ @ 6..!

రైతు కష్టపడుతూ.. పది మందికి అన్నం పెట్టే వ్యక్తి. కానీ.. వారే ఎక్కువగా బలవన్మరణాలకి పాల్పడుతున్నారు. పంట నష్టాలు, ఏటేటా పెట్టుబడులు పెరగడం.. గిట్టుబాటు ధరలు లేకపోవడం.. అప్పులు ఇలా ఎన్నో కారణాలతో.. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా.. రైతుల ఆత్మహత్యలపై ఎన్‌సీఆర్‌బీ అంటే జాతీయ నేర గణాంక సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. తాజాగా.. 2016కి సంబంధించిన ఈ నివేదికలో.. అన్నదాతల ఆత్మహత్యల్లో.. ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉండగా.. […]

 • Tv9 Telugu
 • Publish Date - 11:16 am, Sun, 10 November 19
రైతుల ఆత్మహత్యలు: ఏపీ @ 4, తెలంగాణ @ 6..!

రైతు కష్టపడుతూ.. పది మందికి అన్నం పెట్టే వ్యక్తి. కానీ.. వారే ఎక్కువగా బలవన్మరణాలకి పాల్పడుతున్నారు. పంట నష్టాలు, ఏటేటా పెట్టుబడులు పెరగడం.. గిట్టుబాటు ధరలు లేకపోవడం.. అప్పులు ఇలా ఎన్నో కారణాలతో.. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా.. రైతుల ఆత్మహత్యలపై ఎన్‌సీఆర్‌బీ అంటే జాతీయ నేర గణాంక సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.

తాజాగా.. 2016కి సంబంధించిన ఈ నివేదికలో.. అన్నదాతల ఆత్మహత్యల్లో.. ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉండగా.. తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. ఇక మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది. వీరు కేవలం వ్యవసాయ రంగంపై మీదనే ఆధారపడి ఉన్నవారని.. వ్యవసాయనికి చేసిన అప్పులు తీర్చలేక.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నవారు ఎక్కువగా బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.

2016 గణాంక లెక్కలు:

 • దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడ్డ రైతులు, వ్యవసాయ కూలీలు 11,379
 • ఏపీలో ఆత్మహత్యకు పాల్పడ్డ మగవారి సంఖ్య 730
 • ఆడువారి సంఖ్య 74 మంది
 • 2016లో ఏపీలో రైతుల మరణాల శాతం 7.06
 • తెలంగాణాలో ఆత్మహత్యకు పాల్పడ్డ మగవారి సంఖ్య 572
 • ఆడువారి సంఖ్య 73 మంది
 • 2016లో తెలంగాణలో మరణాల శాతం 5.66 శాతం

దేశవ్యాప్తంగా:

 • 2016 – 11,379
 • 2015 – 12,602
 • 2014 – 12,360
 • 2013 – 11,772