భారత్ చేజారిన నెంబర్‌వన్ ర్యాంక్.. కంగారూలదే హవా..

విరాట్ కోహ్లీ నేతృత్వం వహిస్తున్న భారత్ జట్టు టెస్టుల్లో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. ఇక నాలుగేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాజాగా ఐసీసీ పురుషుల క్రికెట్ టీమ్ ర్యాంకింగ్స్‌ను శుక్రవారం ప్రకటించింది. ఇందులో భాగంగా టెస్టు టీం ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా(26 మ్యాచ్‌లు) 116 పాయింట్లతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకోగా.. 115 పాయింట్లతో న్యూజిలాండ్(21 మ్యాచ్‌లు), భారత్(27 మ్యాచ్‌లు) 114 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అటు టీ20ల్లోనూ కంగారూలు సత్తా చాటారు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మళ్లీ […]

భారత్ చేజారిన నెంబర్‌వన్ ర్యాంక్.. కంగారూలదే హవా..
Follow us

|

Updated on: May 01, 2020 | 5:07 PM

విరాట్ కోహ్లీ నేతృత్వం వహిస్తున్న భారత్ జట్టు టెస్టుల్లో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. ఇక నాలుగేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాజాగా ఐసీసీ పురుషుల క్రికెట్ టీమ్ ర్యాంకింగ్స్‌ను శుక్రవారం ప్రకటించింది. ఇందులో భాగంగా టెస్టు టీం ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా(26 మ్యాచ్‌లు) 116 పాయింట్లతో అగ్రస్థానాన్ని చేజిక్కించుకోగా.. 115 పాయింట్లతో న్యూజిలాండ్(21 మ్యాచ్‌లు), భారత్(27 మ్యాచ్‌లు) 114 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

అటు టీ20ల్లోనూ కంగారూలు సత్తా చాటారు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మళ్లీ జట్టులోకి రావడంతో చాలా రోజుల తర్వాత టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానానికి ఎగబాకారు. ఇక రెండు, మూడు స్థానాల్లో వరుసగా ఇంగ్లాండ్‌, భారత్‌ నిలిచాయి. అటు పాకిస్థాన్‌ నాలుగో స్థానంలో ఉండగా, సౌతాఫ్రికా ఐదో ర్యాంకు సాధించింది. కాగా, టెస్టుల్లో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బౌలర్ల ర్యాంకింగ్‌లో ప్యాట్ కమ్మిన్స్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.

Read This: ‘తలా’ క్రేజ్ అమోఘం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రికార్డు బ్రేక్..