రేపటి నుంచి పాఠశాలలకు ఉపాధ్యాయులు..

కరోనా కారణంగా మార్చి15న మూతపడిన తెలంగాణ పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరంలో సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2020-21 కొత్త విద్యాసంవత్సరాన్ని సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నెల 27 నుంచి టీచర్లు పాఠశాలలకు హాజరుకావాలని, సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమవుతాయని నూతనంగా విడుదలైన మార్గదర్శకాల్లో వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు […]

రేపటి నుంచి పాఠశాలలకు ఉపాధ్యాయులు..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 26, 2020 | 2:32 PM

కరోనా కారణంగా మార్చి15న మూతపడిన తెలంగాణ పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరంలో సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2020-21 కొత్త విద్యాసంవత్సరాన్ని సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

ఈ నెల 27 నుంచి టీచర్లు పాఠశాలలకు హాజరుకావాలని, సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమవుతాయని నూతనంగా విడుదలైన మార్గదర్శకాల్లో వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు తరగతుల వారీగా ఎంత సమయం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలనే విషయంపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ 1వ తరగతి నుంచి 6వ తరగతిలో ప్రవేశాలు కల్పించాలని సూచించింది.

అయితే.. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ నెల 27 నుంచి పాఠశాలలకు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తించనున్నట్లుగా ప్రకటించింది. డిజిటల్‌ బోధనకు ప్రత్యేక షెడ్యూల్‌ రూపొందించి వాటిని రాష్ట్ర స్థాయిలో అమలుపర్చనుంది. ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించేలా షెడ్యూల్‌ను రూపకల్పన చేసింది.  రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఇదే పద్దతిని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.