Telugu Desam Party: పార్టీ వీడాక కూడా బాబుకు షాకిస్తున్న నేతలు

నాలుగైదు రోజులుగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార వైసీపీ గూటికి చేరుతున్న తెలుగు తమ్ముళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్చి 10న కదిరి బాబూరావుతో మొదలైన వలసల పరంపర... మార్చి 14న కేఈ ప్రభాకర్ దాకా కొనసాగింది. అదే బాటలో మరికొందరున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Telugu Desam Party: పార్టీ వీడాక కూడా బాబుకు షాకిస్తున్న నేతలు
Follow us

|

Updated on: Mar 13, 2020 | 2:59 PM

TDP leaders giving shock even after leaving the party: నాలుగైదు రోజులుగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార వైసీపీ గూటికి చేరుతున్న తెలుగు తమ్ముళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్చి 10న కదిరి బాబూరావుతో మొదలైన వలసల పరంపర… మార్చి 14న కేఈ ప్రభాకర్ దాకా కొనసాగింది. అదే బాటలో మరికొందరున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. పార్టీ వీడుతున్న వారికి ప్రత్యామ్నాయం చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు వెళ్ళే పోయే వారు మరిన్ని షాకులిస్తుండడం వర్రీగా మారింది.

మార్చి 10న పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్న కదిరి బాబూరావు… ఆ తర్వాత మూడు రోజులకు పార్టీకి పరోక్షంగా గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత కరణం బలరామ్.. ప్రకాశం జిల్లాలో టీడీపీని బలహీన పరిచే పనుల్లో బిజీగా మారారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సహా పలువురు జిల్లా స్థాయి నేతలను, ద్వితీయ శ్రేణి నాయకులను తమ వెంట వైసీపీ లాగేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అదే పనిగా సమావేశాలు నిర్వహిస్తు.. వైసీపీలో చేరితే ఒనగూడే ప్రయోజనాలను వివరించి వారిని టెంప్ట్ చేస్తున్నారు.

దాంతో ప్రకాశంజిల్లాలో టీడీపీ ఖాళీ అయిపోతుందా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్సీ పోతుల సునీత, మూడు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ఆ తర్వాత ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ గూటికి చేరిన నేపథ్యంలో మరికొంతమంది ముఖ్య నేతలు వైసిపి వైపు చూస్తున్నారనిపిస్తోంది. ప్రధానంగా కరణం బలరాంతో ప్రత్యేక అనుబంధం ఉన్న మరికొందరు నేతలు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారనిపిస్తోంది.

మరోవైపు మార్చి 11న వైసీపీలో చేరిన కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఇదేవిధంగా చక్రం తిప్పుతున్నారు. దాంతో కడప జిల్లాలో టీడీపీకీ కీలకమైన నేతగా మైనారిటీ నేత సుబాన్ బాషాతో టీడీపీకి రాజీనామా చేయించినట్లు సమాచారం. రామసుబ్బారెడ్డితోపాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెరవెనుక పాత్ర పోషించడం వల్లనే సుబాన్ బాషా టీడీపీని వీడినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఆయన చంద్రబాబు, లోకేష్ తీరు నచ్చకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించడం విశేషం. సుబాన్ బాషాతో పాటు ఆయన అనుచరులను డిప్యూటీ సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మరోవైపు కర్నూలు జిల్లా టీడీపీలో కీలక కుటుంబం నుంచి కీలక వ్యక్తి టీడీపీకి గుడ్ బ్ చెప్పారు. గతంలో మంత్రిగా పని చేసిన కేఈ ప్రభాకర్ గత కొన్నేళ్ళుగా తనకు పార్టీలో అన్యాయం జరుగుతందంటూ టీడీపీ గుడ్ బై చెప్పారు. అయితే ప్రభాకర్ రాకను పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వ్యతిరేకిస్తుండడంతో ఆయన వైసీపీలో చేరిక ఇంకా ఖరారు కానట్లు తెలుస్తోంది.

ఇంకోవైపు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆపరేషన్ ఆకర్ష చేపట్టారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్. టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి మరి వైసీపీలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు విశ్వరూప్. దాంతో పలువురు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు వైసిపిలోకి చేరారు. అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ యళ్ల సతీష్ టీడీపీ రాజీనామా చేసి, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.