బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యే?… అదే దారిలో మరికొందరు!

తాజాగా గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు.. ఆయనతో పాటూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికార ప్రతినిధి లంకా దినకర్‌లు.. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఢిల్లీలో ఇటీవలే టీడీపీని వీడిన ఎంపీ గరికపాటితో కలిసి బీజేపీ పెద్దల్ని కలిసినట్లు తెలుస్తోంది. వీరిద్దరే కాదు.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నేతలకు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఎంపీ గరికపాటి రామ్మోహన్‌తోపాటు సుజనా చౌదరి, సీఎం […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:50 pm, Wed, 26 June 19
బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యే?... అదే దారిలో మరికొందరు!

తాజాగా గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు.. ఆయనతో పాటూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికార ప్రతినిధి లంకా దినకర్‌లు.. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఢిల్లీలో ఇటీవలే టీడీపీని వీడిన ఎంపీ గరికపాటితో కలిసి బీజేపీ పెద్దల్ని కలిసినట్లు తెలుస్తోంది. వీరిద్దరే కాదు.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నేతలకు టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

ఎంపీ గరికపాటి రామ్మోహన్‌తోపాటు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీకి గూటికి చేరారు. దీంతో ఏపీలో టీడీపీ నేతలు, కార్యకర్తల వలసలు జోరందుకుంది. పార్టీలో పెద్ద పెద్ద పదవులు అనుభవించిన నేతలు కూడా ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. ఈలోపే అంబికా కృష్ణా, బాలయ్య బంధువు పొట్లూరి బాబు వంటి చోటా మోటా నేతలు కమలం గూటికి చేరిపోయారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేల వంతు వచ్చినట్లు కనిపిస్తోంది.

అనగాని సత్యప్రసాద్ రేపల్లె ఎమ్మెల్యే. 2014లో సత్యప్రసాద్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు.. రేపల్లె టికెట్ కేటాయించారు. ఆయన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఓడించారు. 2019లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి.. మళ్లీ మోపిదేవిపై గెలిచారు. పార్టీకి విధేయుడిగా ఉండే అనగాని బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లడం రాజకీయ ఆసక్తిని కలిగిస్తోంది.
‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍