చంద్రబాబు విధానాలే పార్టీ మార్పుకు కారణం.. మాజీ ఎంపీ జేసీ హాట్ కామెంట్స్

చంద్రబాబు విధానాలే పార్టీ మార్పుకు కారణం.. మాజీ ఎంపీ జేసీ హాట్ కామెంట్స్

ఇప్పటికే టీడీపీకి చెందిన కీలక నేతలు పార్టీ మారి కమలం గూటికి చేరిపోయారు. ఇప్పటికీ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరుగా నిలిచే జేసీ.. బీజేపీపై కీలక వ్యాఖ్యాలు చేసి కాక పుట్టించారు. ఏపీలో ఇప్పుడిప్పుడే బీజేపీ తన క్యాడర్ పెంచుకునే పనిలో పడింది. రానున్న ఎన్నికల నాటికి కమలం పార్టీ బలమైన శక్తిగా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 14, 2019 | 3:24 PM

ఇప్పటికే టీడీపీకి చెందిన కీలక నేతలు పార్టీ మారి కమలం గూటికి చేరిపోయారు. ఇప్పటికీ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరుగా నిలిచే జేసీ.. బీజేపీపై కీలక వ్యాఖ్యాలు చేసి కాక పుట్టించారు.

ఏపీలో ఇప్పుడిప్పుడే బీజేపీ తన క్యాడర్ పెంచుకునే పనిలో పడింది. రానున్న ఎన్నికల నాటికి కమలం పార్టీ బలమైన శక్తిగా ఎదిగేందుకు ఇప్పటినుంచి పావులు కదుపున్నట్టు తెలుస్తోంది. దీనికి ఉదాహరణగానే తమ పార్టీలో చేర్చుకునేందుకు తలుపులు బార్లా తెరిచింది. ఇప్పటికే టీడీపీ నుంచి నలుగురు ఎంపీలు జంప్ చేశారు. నిన్నటివరకు బాబు పక్షాన నిలిచి ఉన్నపాటున బీజేపీ పాట అందుకున్నారు. వీరిలో సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్‌లు ఉన్నారు. వీరి చేరిక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలనుంచి బీజేపీలోకి వలసలు పెరిగాయనే విషయం తెలిసిందే. అయితే తాజాగా టీడీపీ నుంచి పోటీచేసి ఓటమి పాలైన జేసీ దివాకర్‌రెడ్డి ఏపీలో బీజేపీ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో బీజేపీ ప్రభంజనం ప్రారంభమైందని, అది ఎక్కువైనా, తక్కువైనా సరే అంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో టీడీపీ నుంచి బీజేపీకి వలసలు పెరగడానికి తమ పార్టీ అధినేత చంద్రబాబు పాత్ర పరోక్ష కారణమంటూ అధినేతను కూడా టార్గెట్ చేశారు. చంద్రబాబు ఆలోచనలపైనే బీజేపీ ఆధారపడి ఉందన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ ప్రధాని మోదీ ఆలోచనలపైనే ఆధారపడి ఉన్నాయన్నారు జేసీ.
ప్రస్తుతం దేశంలో మోదీ హవా నడుస్తోందని, తమ పార్టీ అధినేత చంద్రబాబు తప్పుడు నిర్ణయాలు, మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ వలసలకు కారణమంటూ విశ్లేషించారు.

జేసీ చేసిన తాజా కామెంట్స్ ఇటు పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేయడంతో పాటు బీజేపీకి అనుకూలంగా ఉండటంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చను లేవనెత్తింది. టీడీపీ నుంచి ఇప్పటికే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరుతుండగా జేసీ కూడా అటువైపు చూస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu