వివాదాస్పదంగా మారిన వైసీపీ నాయకుల శ్రీవారి దర్శనాలు..విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ, బీజేపీ

తిరుమలలో వైసీపీ నాయకుల శ్రీవారి దర్శనాల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. నిన్న అన్నమయ్య మార్గం ద్వారా రెండు వేలమందితో పాదయాత్రగా కొండపైకి వచ్చిన వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, ఆకెపాటి అమర్నాథ రెడ్డిపై..

వివాదాస్పదంగా మారిన వైసీపీ నాయకుల శ్రీవారి దర్శనాలు..విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ, బీజేపీ

తిరుమలలో వైసీపీ నాయకుల శ్రీవారి దర్శనాల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. నిన్న అన్నమయ్య మార్గం ద్వారా రెండు వేలమందితో పాదయాత్రగా కొండపైకి వచ్చిన వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, ఆకెపాటి అమర్నాథ రెడ్డిపై టీడీపీ, బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నాయి.

రెండు వేల మందికి దర్శనాలు కల్పించడం పై తీవ్రంగా తప్పుబట్టారు. దూరం నుంచి వచ్చిన భక్తులను కొండపైకి అనుమతించకపోగా.. లాఠీఛార్జి చేయడం హేయమని వారు ఖండించారు. నిబంధనలకు విరుద్ధంగా 2 వేల మంది వైసీపీ శ్రేణులు.. కొండ మీద రాజకీయ ఊరేగింపులు చేస్తూ.. డ్రోన్లు ఎగురవేస్తుంటే భద్రతాధికారులు ఏం చేస్తున్నట్లు? అని చంద్రబాబు ప్రశ్నించారు.

భక్తులను నిలిపివేసి వైసీపీ కార్యకర్తలకు నిబంధనలకు విరుద్ధంగా దర్శనాలు చేయించారని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. వేల సంఖ్యలో వైసీపీ కార్యకర్తల దర్శనానికి సంబంధించిన టికెట్ల ఖర్చు మొత్తాన్ని వారం రోజుల్లో రాబట్టాలంటూ డిమాండ్ చేశారు.

తిరుమల వెంకన్న దర్శనానికి వస్తున్న భక్తులను అడ్డుకుంటున్న టీటీడీ సిబ్బంది.. వైసీపీ నేతలకు మాత్రం శ్రీవారి దర్శనాలను కల్పించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. నిన్న అన్నమయ్య మార్గం ద్వారా రెండు వేలమంది తో పాదయాత్ర గా కొండపైకి వచ్చారు వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, ఆకెపాటి అమర్నాథ రెడ్డి. వీరితో పాటు వచ్చిన వారందరికీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా దర్శనం కల్పించారు అధికారులు.