ఆర్టీసీ సమ్మె ఉధృతం.. రేపు ప్రగతి భవన్ ముట్టడిస్తారా?

ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించిన టీకాంగ్రెస్ ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధం చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులకు మద్దతునిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్త బంద్‌లో పాల్గొన్న కాంగ్రెస్ .. సోమవారం ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. రెండు వారాలకు పైబడి సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో కాంగ్రెస్ నేతలు తీవ్రస్ధాయిలో చర్చించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌లో 50 శాతం న్యాయముందన్న హైకోర్టు వ్యాఖ్యలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఆగ్రహం […]

ఆర్టీసీ సమ్మె ఉధృతం.. రేపు ప్రగతి భవన్ ముట్టడిస్తారా?
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2019 | 8:40 PM

ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించిన టీకాంగ్రెస్ ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధం చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులకు మద్దతునిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్త బంద్‌లో పాల్గొన్న కాంగ్రెస్ .. సోమవారం ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. రెండు వారాలకు పైబడి సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో కాంగ్రెస్ నేతలు తీవ్రస్ధాయిలో చర్చించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌లో 50 శాతం న్యాయముందన్న హైకోర్టు వ్యాఖ్యలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్ ముట్టడి చేపట్టాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ నివాసంలో పలువురు కాంగ్రెస్ నేతలు సమావేశమై చర్చిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆర్టీసీ జేఏసీ మాత్రం ప్రగతి భవన్ ముట్టడిపై ఇంకా స్పందించలేదు. ప్రభుత్వం ఖచ్చితంగా తమతో చర్చలు జరిపి తీరాలని డిమాండ్ చేస్తున్న ఆర్టీసీ నేతలను, వారికి మద్దతు ఇస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డి .. రాజ్యాంగ సంక్షోభం కూడా రావచ్చంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రేపు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం జరిగితే పరిస్థితులు తారాస్థాయికి చేరినట్టే నని భావిస్తున్నారు.

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..