అర్జున్ సుర‌వ‌రంలో స్టైలిష్ విలన్.. త‌రుణ్ అరోరా!

అర్జున్ సుర‌వ‌రంలో స్టైలిష్ విలన్.. త‌రుణ్ అరోరా!

త‌రుణ్ అరోరా.. అర్జున్ సుర‌వ‌రంలో విలన్ గా నటించాడు. ఇటీవ‌ల `అర్జున్ సుర‌వ‌రం` విడుద‌లైన సంద‌ర్భంగా తరుణ్ అరోరా తో ఇంటర్వ్యూ… నా కెరీర్ మోడలింగ్ తో మొదలైంది. కాబట్టి నేను ప్ర‌తి సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తాను. అలా ప్రత్యేకత క‌నిపించేలా చూసుకోవ‌డంలో సక్సెస్ అయ్యానని సంతృప్తి ఉంది. నిఖిల్ అర్జున్ సురవరం లో మంచి పాత్ర‌లో నటించాను. త‌మిళ చిత్రం `కణిత‌న్‌`కి రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  తెలుగులో మాత్రం ఈ సినిమా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 03, 2019 | 2:04 AM

త‌రుణ్ అరోరా.. అర్జున్ సుర‌వ‌రంలో విలన్ గా నటించాడు. ఇటీవ‌ల `అర్జున్ సుర‌వ‌రం` విడుద‌లైన సంద‌ర్భంగా తరుణ్ అరోరా తో ఇంటర్వ్యూ… నా కెరీర్ మోడలింగ్ తో మొదలైంది. కాబట్టి నేను ప్ర‌తి సినిమాలో స్టైలిష్ గా కనిపిస్తాను. అలా ప్రత్యేకత క‌నిపించేలా చూసుకోవ‌డంలో సక్సెస్ అయ్యానని సంతృప్తి ఉంది. నిఖిల్ అర్జున్ సురవరం లో మంచి పాత్ర‌లో నటించాను. త‌మిళ చిత్రం `కణిత‌న్‌`కి రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  తెలుగులో మాత్రం ఈ సినిమా కాస్త డిఫరెంట్ గా నిర్మించారు. సెంటిమెంట్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. అందరూ  మెచ్చుకుంటున్నారు.

నేను అస్సోంలో జన్మించాను . పై చ‌దువుల కోస‌మ‌ని చెన్నై వ‌చ్చాను. మోడ‌ల్‌గా నా  కెరీర్ బెంగుళూరులో మొదలైంది. . అలా దక్షిణ భారతంతో నాకు అనుబంధం ఉంది. హిందీ చిత్రాల్లో అవ‌కాశాలు రావ‌డంతో ముంబై వెళ్లాను. ఇప్పుడు తెలుగులో అవకాశాలు వచ్చాయి, మ‌ళ్లీ ద‌క్షిణాదికి వ‌చ్చా. ఎక్క‌డికి వెళ్లినా నువ్వు అక్క‌డివాడివి క‌దా అంటుంటారు. చాలామంది న‌న్ను సౌత్ విల‌న్ అని పిలుస్తుంటారు. నా భార్య అంజలా జవేరి నేను చేసిన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. కొన్ని సినిమాల్లో చేసిన పాత్ర‌లు నచ్చకపోవ‌డంతో మళ్ళీ మోడలింగ్ లోకి వెళ్ళాను. కానీ అప్పుడు చేసిన ఆ త‌ప్పులు, ఆ సినిమాలు ఇప్పుడు బాగా ప‌నికొస్తున్నాయి. నేను చేసిన తప్పులు నాకు చాలా అనుభవాన్నిచ్చాయి. ముంబాయిలో నాకు అంజలాకు పరిచయం ఏర్పడింది. ముందు నేనే ప్రేమ‌ని వ్య‌క్తం చేశా.  ఒక ఈవెంట్‌లో క‌లుసుకున్న‌ప్పుడు ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత కొన్నాళ్లు స్నేహితులుగా ఉన్నాం. త‌ర్వాత పెళ్లి అయింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu