అక్కడ.. బైక్ పై ఇద్దరు వెళ్తే రూ.500 ఫైన్..!

తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో చెన్నైలో ట్రాఫిక్ రూల్స్ మార్చారు పోలీసులు. టూ వీలర్ వాహనాలపై ఒక్కరు మాత్రమే వెళ్లాలని సూచిస్తున్నారు. ఇద్దరు ప్రయాణిస్తే రూ.500 జరిమానా.

అక్కడ.. బైక్ పై ఇద్దరు వెళ్తే రూ.500 ఫైన్..!
Follow us

|

Updated on: Jun 04, 2020 | 2:34 PM

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహారిస్తున్నాయి. కొవిడ్-19 నిబంధనలు పాటించని వారికి జరిమానాలు సైతం విధిస్తున్నారు. తాజాగా భౌతిక దూరం పాటించని టూ వీలర్ రైడర్స్ కి చలాన్ విధిస్తున్నారు తమిళనాడు పోలీసులు. తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో చెన్నైలో ట్రాఫిక్ రూల్స్ మార్చారు పోలీసులు. టూ వీలర్ వాహనాలపై ఒక్కరు మాత్రమే వెళ్లాలని సూచిస్తున్నారు. ఇద్దరు ప్రయాణిస్తే రూ.500 జరిమానా విధిస్తున్నారు. ఈ బుధవారం నుంచి కొత్త రూల్ అమలులోకి వచ్చినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్నాయి. రాష్ట్రంలో ఐదో విడత లాక్ డౌన్ సందర్భంగా సడలింపు ఇవ్వడంతో వాహనాలపై వెళ్లేవారి సంఖ్యను క్రమంగా పెరుగుతోంది. దీంతో వాహనాల రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఈ మేరకు నిబంధనలు తీసుకువచ్చారు. అయితే ఆ జరిమనాపై నగరవాసులు తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తగిన రవాణా సదుపాయం కల్పించకుండా ప్రభుత్వం ఇలా కొత్త రూల్స్ పేరుతో చలాన వసూళ్లు చేయడం సరికాదంటున్నారు.