తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉ:ది. దేశంలోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో కొత్తగా 2,532 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 59,377కి చేరింది. ఇవాళ ఒక్కరోజే 53 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 757కు చేరినట్లు ఆ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 25,863 మంది యాక్టివ్ కేసులతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారని ఓ ప్రకటనలో తెలిపింది.