T20 World Cup 2022: పాక్‌తో మ్యాచ్‌కు ముందే మరో 4 టీ20లు ఆడనున్న టీమిండియా.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

టీం ఇండియా తన తొలి మ్యాచ్‌ని అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. అయితే తొలి మ్యాచ్‌కు మూడు వారాల ముందు టీమ్ ఇండియా ఆస్ట్రేలియా వెళ్లి మొత్తం నాలుగు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.

T20 World Cup 2022: పాక్‌తో మ్యాచ్‌కు ముందే మరో 4 టీ20లు ఆడనున్న టీమిండియా.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..
Team India
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 07, 2022 | 6:30 AM

T20 ప్రపంచ కప్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ కోసం14 మంది సభ్యులతో కూడిన టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియాకు బయలుదేరింది. టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమైనప్పటికీ, టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ను అక్టోబర్ 23న ఆడనుంది. అంటే తొలి రౌండ్‌లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో 8 జట్లు పాల్గొనగా, 4 విజేత జట్లు సూపర్-12కి అర్హత సాధిస్తాయి. దీని ప్రకారం అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. టీం ఇండియా తన తొలి మ్యాచ్‌ని అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది. అయితే తొలి మ్యాచ్‌కు మూడు వారాల ముందు టీమ్ ఇండియా ఆస్ట్రేలియా వెళ్లి మొత్తం నాలుగు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం, ICC నిర్వహించే రెండు వార్మప్ మ్యాచ్‌లలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లతో తలపడుతుంది. అయితే అంతకంటే ముందే మరో రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడేందుకు టీమ్ ఇండియా ప్రణాళికలు రచించుకుంది.

బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమ్ ఇండియా మొత్తం నాలుగు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. వాటిలో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఐసిసి షెడ్యూల్ చేయగా, మిగిలిన రెండు మ్యాచ్‌లను టీమ్ ఇండియా నిర్వహిస్తోంది. అంటే వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో 2 ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లు అక్టోబర్ 10, 12 తేదీల్లో జరగనున్నాయి. దీని తర్వాత టీమ్ ఇండియా ఐసీసీ షెడ్యూల్ చేసిన ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది.

టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇక్కడ ఉంది:

  • అక్టోబర్- 10 : భారతదేశం vs WA11
  • అక్టోబర్- 12 : భారత్ vs WA11
  • అక్టోబర్- 17: భారత్ vs ఆస్ట్రేలియా
  • అక్టోబర్- 19: భారత్ vs న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా షెడ్యూల్:

  • అక్టోబరు-23 : భారత్ vs పాకిస్థాన్ – మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం
  • అక్టోబర్-27: భారతదేశం vs క్వాలిఫైయర్ గ్రూప్ A రన్నరప్ – సిడ్నీ క్రికెట్ స్టేడియం
  • అక్టోబర్- 30: భారత్ vs సౌతాఫ్రికా – పెర్త్ స్టేడియం
  • నవంబర్-2: భారత్ vs బంగ్లాదేశ్ – అడిలైడ్ ఓవల్
  • నవంబర్-6: భారత్ vs క్వాలిఫైయర్ B గ్రూప్ విజేత

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్‌

ఇవి కూడా చదవండి

రిజర్వ్‌ బెంచ్‌: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!