వరుణ్‌కు చిరు షాక్.. ఎందుకంటే.?

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుని బ్లాక్‌బస్టర్‌ దిశగా దూసుకుపోతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు అద్భుతంగా నటించారని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దాదాపు 300 కోట్లతో రూపొందిన ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో రిలీజయ్యింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సైరా’ హవా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే ‘సైరా’ దెబ్బకు ఓ హిట్ సినిమా లైమ్ లైట్‌లో లేకుండా […]

వరుణ్‌కు చిరు షాక్.. ఎందుకంటే.?
Ravi Kiran

|

Oct 04, 2019 | 12:56 PM

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుని బ్లాక్‌బస్టర్‌ దిశగా దూసుకుపోతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు అద్భుతంగా నటించారని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దాదాపు 300 కోట్లతో రూపొందిన ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో రిలీజయ్యింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సైరా’ హవా కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే ‘సైరా’ దెబ్బకు ఓ హిట్ సినిమా లైమ్ లైట్‌లో లేకుండా పోయింది.

రిలీజ్‌కు ముందే ఆ సినిమా టైటిల్ వివాదాల్లో చిక్కుకుంది. పెద్ద సెన్సేషన్‌గా మారింది. ఇక చేసేదేం లేక చిత్ర యూనిట్ విడుదలకు ముందు రోజే టైటిల్ మార్చారు. కొత్త టైటిల్‌తో విడుదలైనప్పటికీ హీరో అద్భుత నటనకు ప్రేక్షకులు ఆ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికే ఆ సినిమా ఏంటో మీకు తెలిసే ఉంటుంది. అదే ‘గద్దలకొండ గణేష్’. వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఫ్యాన్స్‌ నుంచి అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ‘గద్దలకొండ గణేష్’ పాత్రలో వరుణ్ తేజ్ పరకాయ ప్రవేశం చేశాడని చెప్పొచ్చు. తమిళ హిట్ మూవీ ‘జిగర్తాండ’కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. భారీ వసూళ్లతో బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. అలాంటి ఈ సినిమాకు ‘సైరా’ విడుదలైన తర్వాత గట్టి దెబ్బే తగిలిందని చెప్పవచ్చు.

మెగాస్టార్ చిరంజీవి సినిమా.. అందులోనూ ప్యాన్ ఇండియా మూవీ.. పైగా భారీ తారాగణం.. ఇంకేముంది చిన్న సినిమాల కలెక్షన్స్‌కు భారీ ఎఫెక్ట్ పడుతుంది. ‘గద్దలకొండ గణేష్’ విషయంలోనూ అదే జరిగింది. ఎంత హిట్ టాక్ తెచ్చుకున్నా.. ‘సైరా’కు పోటీ ఇవ్వలేకపోతోంది. దీంతో వరుణ్‌కు పెదనాన్న చిరు గట్టి షాక్ ఇచ్చినట్లయింది. కాగా ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్‌ మాత్రం కాస్త అటు ఇటుగా నమోదవుతాయని అంచనా.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu