‘దిల్ బేచారా’ రివ్యూ… కంటతడి పెట్టించిన సుశాంత్ యాక్టింగ్..

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా 'దిల్ బేచారా'. నిన్న ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలైంది. సంజన సంఘీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.

  • Updated On - 10:27 am, Sat, 25 July 20
‘దిల్ బేచారా’ రివ్యూ… కంటతడి పెట్టించిన సుశాంత్ యాక్టింగ్..

Dil Bechara Movie Review:

టైటిల్ : ‘దిల్ బేచారా’

తారాగణం : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజన సంఘీ, స్వస్థికా ముఖర్జీ తదితరులు

సంగీతం : ఏఆర్ రెహమాన్

నిర్మాణ సంస్థ : ఫాక్స్ స్టార్ స్టూడియోస్

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ముఖేష్ ఛాబ్రా

విడుదల తేదీ: 24-07-2020(డిస్నీ హాట్‌స్టార్‌లో)

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’. నిన్న ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదలైంది. సంజన సంఘీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. రీసెంట్‌గా రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ రికార్డులు బ్రేక్ చేసింది. మరి సుశాంత్ చివరి జ్ఞాపకమైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ‌ :

కిజీ బాసు(సంజన సంఘీ) క్యాన్సర్ పేషెంట్. కాలేజీ, హాస్పిటల్, తనకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ పాటలు వినడం రోజూ ఇదే ఆమె బోరింగ్ లైఫ్. అలాంటి ఆమె జీవితంలోకి ఇమ్మాన్యువల్ రాజ్ కుమార్ జూనియర్ ఉరఫ్ మ్యానీ( సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌) వస్తాడు. అతడు కూడా క్యాన్సర్‌ పేషెంటే.

మ్యానీ రజనీకాంత్‌కు పెద్ద వీరాభిమాని. ఆయనలాగా పెద్ద హీరో కావాలని అనుకుంటాడు. ఇక మ్యానీ మొదటి చూపులోనే కిజీని చూసి ప్రేమలో పడతాడు. ఎప్పుడూ తన చుట్టూ ఉన్నవాళ్లను నవ్విస్తూ ఉంటాడు. కిజీ కోరికలను ఒక్కొక్కటిగా తీరుస్తుంటాడు. అలాంటి తరుణంలో ఇరువురూ పారిస్ వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఇద్దరూ అక్కడికి ఎందుకు వెళ్లారు.? చివరికి ఇద్దరి ప్రయాణం ఎక్కడ ముగిసింది.? అనేది కథాంశం.

న‌టీన‌టుల అభినయం:

మ్యానీ పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ జీవించారు. సినిమాలోని ప్రతీ సన్నివేశం ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఈ మూవీలో సుశాంత్ నటన అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఇంతటి గొప్ప నటుడిని బాలీవుడ్ దూరం పెట్టిందా.? అని కోపం కూడా వస్తుంది. మొదటి సీన్ నుంచి చివరి వరకు సుశాంత్ తన అద్భుతమైన నటనతో అభిమానులను కట్టిపడేస్తాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు పీక్స్ అని చెప్పాలి. ఇక హీరోయిన్ సంజన సంఘీ కూడా అద్భుతంగా నటించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేష‌ణ‌ :

‘దిల్ బేచారా’ క్లాసిక్ మూవీ. కథ సింపుల్‌గా ఉన్నా.. ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఇద్దరు క్యాన్సర్ పేషెంట్స్ వారికి ఉన్న చిన్న జీవితాన్ని తమకు నచ్చినట్లుగా మార్చుకుని ఎలా జీవించారన్నదే ఈ ‘దిల్ బేచారా’ కథ. సుశాంత్ ఈ సినిమాను ప్రాణం పెట్టి చేశాడు. ప్రతీ సన్నివేశంలోనూ ఆయన యాక్టింగ్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తుంది. మొత్తం సినిమా ఒక ఎత్తయితే.. క్లైమాక్స్ ఒక ఎత్తు. ‘రాజా మర్ గయా’ అని ఆయన చెప్పే డైలాగుకు కన్నీళ్లు ఆగవు. ఇక రెహమాన్ మ్యూజిక్ ఈ చిత్రాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్ళింది.

సాంకేతిక విభాగాల పనితీరు:

ఓవరాల్‌గా సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు బలం అని చెప్పాలి. ముఖ్యంగా టైటిల్ సాంగ్, సుశాంత్ వేసే స్టెప్స్ అద్భుతంగా ఉంటాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్. కెమెరా పనితనం బాగుంది. దర్శకుడిగా ముకేష్ చాబ్రా తొలి ప్రయత్నం ఓ మధుర జ్ఞాపకం. సినిమాను ఎక్కడా కూడా సైడ్ ట్రాక్ పట్టించకుండా అద్భుతంగా తెరకెక్కించాడు.

చివరి మాట: ‘దిల్ బేచారా’.. ఈ సినిమా సుశాంత్‌కు గొప్ప నివాళి..

Also Read: ‘పేరు’ కోసమే సుశాంత్ ప్రయత్నించాడు..అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు..