మెగాస్టార్ 152లో ఊహించని సర్‌ప్రైజ్.. అదేంటంటే.?

‘సైరా’ నరసింహారెడ్డితో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో సోషియో పొలిటికల్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే హీరోయిన్‌గా త్రిషను ఫైనల్ చేశారని వినికిడి. ఈ సినిమాలో చిరు సరసన ఇద్దరు హీరోయిన్లు నటించే స్కోప్ ఉండటంతో.. రెండో నాయిక కోసం కొరటాల సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాడట. […]

మెగాస్టార్ 152లో ఊహించని సర్‌ప్రైజ్.. అదేంటంటే.?
Ravi Kiran

|

Nov 08, 2019 | 8:25 PM

‘సైరా’ నరసింహారెడ్డితో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టాడు. చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో సోషియో పొలిటికల్ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే హీరోయిన్‌గా త్రిషను ఫైనల్ చేశారని వినికిడి.

ఈ సినిమాలో చిరు సరసన ఇద్దరు హీరోయిన్లు నటించే స్కోప్ ఉండటంతో.. రెండో నాయిక కోసం కొరటాల సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాడట. ఇప్పటికే నయనతార, కాజల్, తమన్నా లాంటి అగ్ర కథానాయికల పేర్లు పరిశీలిస్తుండగా.. వాళ్లనే మళ్ళీ రిపీట్ చేస్తే బాగోదని కొరటాల భావిస్తున్నాడని సమాచారం. అందుకే కొత్త స్టార్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఇక ఈ తరుణంలో.. చిలిపిదనం, కొంటెదనం కలగలిసిన బొమ్మరిల్లు హాసిని.. అదేనండీ జెనీలియా అయితే రెండో హీరోయిన్‌కు సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట.

దర్శకనిర్మాతలు ఇప్పటికే జెనీలియాను సంప్రదించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ అన్నీ వర్కౌట్ అయితే.. హాసిని ఫ్యాన్స్‌కు ఇది అదిరిపోయే న్యూస్.. అంతేకాకుండా ఆమె రీ-ఎంట్రీకి సరైన సినిమా అవుతుందని సినీ విశ్లేషకుల వాదన. మరి ఆమె దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాల్సిందే. కాగా, 2016లో జాన్ అబ్రహం‌తో ‘ఫోర్స్ 2’ అనే హిందీ చిత్రం చేసిన జెనీలియా.. 2018లో భర్త రితీష్ దేశ్‌ముఖ్‌తో మరాఠీ సినిమాలో నటించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu