బ్రేకింగ్.. అయోధ్య కేసు..’ సుప్రీం ‘తీర్పు పూర్తి’ పాఠం’ !

దేశంలో ఇన్నేళ్ళుగా నలుగుతూ వస్తున్న కీలకమైన అయోధ్య కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు తొలి భాగం ప్రకారం.. వివాదాస్పద స్థలానికి సంబంధించి షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన అప్పీలును కోర్టు కొట్టివేసింది. ఈ భూమి తమకే చెందుతున్న ఈ బోర్డు వాదనలను కోర్టు తోసిపుచ్చింది. బాబర్ హయాంలో అక్కడి ఖాళీ స్థలంలో కట్టడం జరిగిందనడానికి ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. అక్కడ మసీదు ఉండేదనడానికి ఆధారాలు లేవన్న పురావస్తు శాఖ నివేదికతో […]

బ్రేకింగ్.. అయోధ్య కేసు..' సుప్రీం 'తీర్పు పూర్తి' పాఠం' !
Follow us

| Edited By:

Updated on: Nov 09, 2019 | 1:53 PM

దేశంలో ఇన్నేళ్ళుగా నలుగుతూ వస్తున్న కీలకమైన అయోధ్య కేసులో సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు తొలి భాగం ప్రకారం.. వివాదాస్పద స్థలానికి సంబంధించి షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన అప్పీలును కోర్టు కొట్టివేసింది. ఈ భూమి తమకే చెందుతున్న ఈ బోర్డు వాదనలను కోర్టు తోసిపుచ్చింది. బాబర్ హయాంలో అక్కడి ఖాళీ స్థలంలో కట్టడం జరిగిందనడానికి ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. అక్కడ మసీదు ఉండేదనడానికి ఆధారాలు లేవన్న పురావస్తు శాఖ నివేదికతో కోర్టు ఏకీభవించింది. ఈ స్థల వివాదానికి సంబంధించి నిర్మోహి అఖారా దాఖలు చేసిన దావాను కూడా న్యాయమూర్తులు తోసిపుచ్చారు. 12 వ శతాబ్దంలో ఈ స్థలంలో ఆలయం ఉండేదనడానికి ఆధారాలు ఉన్నాయని పురావస్తు శాఖ పేర్కొందని న్యాయమూర్తులు అన్నారు. అయితే ఆ శాఖ సమర్పించిన ఆధారాలను ఇంకా మదింపు చేయాల్సిన అవసరం ఉందని కూడా కోర్టు పేర్కొంది.

ఇంకా ఈ తీర్పులోని ప్రధాన అంశాలు.. షియా వక్ఫ్ బోర్డు తనదని చెప్పుకుంటున్న స్థలం రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వానిదే.. వివాదాస్పద స్థలంపై హక్కులు తేల్చాల్సింది రికార్డులే మత విశ్వాసాల ఆధారంగా ఈ భూమి ఎవరిదని తీర్పునివ్వలేం లీగల్ ప్రిన్సిపల్స్ పై ఆధారపడి రామజన్మభూమి స్థల టైటిల్ హక్కును నిర్ణయించాలి.. 5 ఎకరాల స్థలాన్ని సున్నీవక్ఫ్ బోర్డుకు అప్పగించాలి మసీదు నిర్మాణం కోసం వేరే స్థలాన్ని కేటాయించాలి వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తి లేదు మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును కేంద్రం ఏర్పాటు చేయాలి వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణా నికి అనుమతి ఈ తీర్పు ఏకగ్రీవం.. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇఛ్చిన తీర్పును తప్పు పట్టిన కోర్టు వివాదాస్పద భూమి రామ్ లాలాకే చెందుతుంది మసీదు నిర్మాణం కోసం మసీదును కూల్చినట్టు ఆధారాలు లేవు వివాదాస్పద స్థలంలో పూజలు చేసే హక్కు నిర్మోహి అఖారాకు లేదు 1885 కు ముందు కూడా హిందువులు అక్కడ పూజలు చేసేవారు 2. 77 ఎకరాల భూమిని అయోధ్య ట్రస్టుకు వెంటనే అప్పగించాలి వివాదాస్పద స్థలాన్ని కేంద్రం తక్షణమే స్వాధీనం చేసుకోవాలి మసీదు నిర్మాణం ఖాళీ స్థలంలో జరగలేదు ముస్లిములకు అక్కడ నమాజ్ చేసుకునే హక్కు ఉంది. కోర్ట్ ఇచ్చిన తీర్పు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.