ఆ జర్నలిస్ట్‌ను తక్షణమే విడుదల చేయండి: సుప్రీం ఆదేశాలు

ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ ప్రతిష్టను దెబ్బ తీసేలా ప్రశాంత్ కనోజియా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యోగీ ఆదిత్యనాథ్‌కు తాను పెళ్లి ప్రపోజల్ చేశానంటూ ఓ మహిళ ఆయన కార్యాలయం ముందు రిపోర్టర్‌లకు వెల్లడించిన వైనాన్ని ప్రశాంత్ తన వీడియో ద్వారా రచ్చ చేయడంతో ఈ ఉదంతం పతాక వార్తలకెక్కింది. ఈ కేసులో పోలీసులు ఆ మహిళతో […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:33 am, Tue, 11 June 19
ఆ జర్నలిస్ట్‌ను తక్షణమే విడుదల చేయండి: సుప్రీం ఆదేశాలు

ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ ప్రతిష్టను దెబ్బ తీసేలా ప్రశాంత్ కనోజియా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యోగీ ఆదిత్యనాథ్‌కు తాను పెళ్లి ప్రపోజల్ చేశానంటూ ఓ మహిళ ఆయన కార్యాలయం ముందు రిపోర్టర్‌లకు వెల్లడించిన వైనాన్ని ప్రశాంత్ తన వీడియో ద్వారా రచ్చ చేయడంతో ఈ ఉదంతం పతాక వార్తలకెక్కింది. ఈ కేసులో పోలీసులు ఆ మహిళతో పాటు మరో ఐదుగురు జర్నలిస్ట్‌లను కూడా అరెస్ట్ చేశారు. దీనిపై ప్రశాంత్ సుప్రీంను ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆయన విడుదలకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.