ఏపీ, తెలంగాణకు సుప్రీం నోటీసులు

ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసిన చంద్రబాబు, కేసీఆర్ పథకాలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకంపై నిషేదం విధించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశట్టిన రైతుబంధు పేరుతో పెద్ద ఎత్తున […]

ఏపీ, తెలంగాణకు సుప్రీం నోటీసులు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 02, 2019 | 5:26 PM

ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసిన చంద్రబాబు, కేసీఆర్ పథకాలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకంపై నిషేదం విధించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశట్టిన రైతుబంధు పేరుతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగినట్లు పిటిషనర్ సుప్రీంకు విన్నవించారు. ఎన్నికల సమయంలో అమలు చేసిన ఈ పథకాలను చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని విన్నవించారు. అదే విధంగా ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ నగదు బదిలీ పథకాలు అమలు చేయకుండా మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు.