Board Exam: రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ.. నాలుగు రాష్ట్రాలకు నోటీసులు

Board Exam: రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. పరీక్షలను ఇప్పటి వరకు రద్దు చేయని రాష్ట్రాలు పంజాబ్, అస్సాం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్..

Board Exam: రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ.. నాలుగు రాష్ట్రాలకు నోటీసులు
Follow us

|

Updated on: Jun 17, 2021 | 1:33 PM

Board Exam: రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. పరీక్షలను ఇప్పటి వరకు రద్దు చేయని రాష్ట్రాలు పంజాబ్, అస్సాం, త్రిపుర, ఆంధ్రప్రదేశ్ ఉండగా, ఈ నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. 12వ తరగతి పరీక్షల విషయంలో 28 రాష్ట్రాల్లో, 18 రాష్ట్రాలు రద్దు చేశాయి. 6 రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయని న్యాయస్థానం తెలిపింది. 4 రాష్ట్రాలు రద్దు చేయలేదని, ఆ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే కేరళలో 11వ తరగతి పరీక్షలు కూడా రద్దు చేయలేదు. ఆ రాష్ట్రానికి కూడా నోటీసులు జారీ జారీ చేసిది.

కాగా, దేశంలో కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలన్ని మూతపడ్డాయి. దీంతో విద్యార్థులకు పరీక్షలను సైతం రద్దు చేశాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేయకపోవడంతో ఆ రాష్ట్రాలపై వ్యతిరేకత ఎదురైంది. కనీసం బోర్డు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తుండగా, మరి కొందరు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. చివరికి ఈ వ్యవహారం అంతా కోర్టు వరకు వెళ్లింది. దీంతో ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.

ఇవీ కూడా చదవండి

TS CET: తెలంగాణలో సెట్‌ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు..! ఆగస్టులో నిర్వహించేందుకు ఏర్పాట్లు..!

CBSE: సీబీఎస్ఈ 12వ తరగతిలో మార్కుల విధానం, స్టేట్ బోర్డు ఎగ్జామ్స్ రద్దు అంశంపై సుప్రీంలో కొనసాగుతున్న వాదనలు