చిదంబరం అభ్యర్థన నిష్ప్రయోజనం.. సుప్రీంకోర్టు

చిదంబరం అభ్యర్థన నిష్ప్రయోజనం.. సుప్రీంకోర్టు

ముందస్తు బెయిలు కోరుతూ మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయనను సీబీఐ ఇదివరకే అరెస్టు చేసిందని, దీంతో ఆయన బెయిల్ పిటిషన్ నిష్ప్రయోజనమైందని కోర్టు పేర్కొంది. సీబీఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను, చిదంబరం బెయిల్ పిటిషన్ ను కూడా ఒకేరోజు విచారించవలసి వచ్చిందని పేర్కొంది. చిదంబరాన్ని ఈడీ ఆరెస్టు చేయకుండా ఆయనకు తాత్కాలిక భద్రతను కోర్టు గత శుక్రవారం వరకు పొడిగించింది. […]

Anil kumar poka

| Edited By: Ram Naramaneni

Aug 26, 2019 | 3:50 PM

ముందస్తు బెయిలు కోరుతూ మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆయనను సీబీఐ ఇదివరకే అరెస్టు చేసిందని, దీంతో ఆయన బెయిల్ పిటిషన్ నిష్ప్రయోజనమైందని కోర్టు పేర్కొంది. సీబీఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను, చిదంబరం బెయిల్ పిటిషన్ ను కూడా ఒకేరోజు విచారించవలసి వచ్చిందని పేర్కొంది. చిదంబరాన్ని ఈడీ ఆరెస్టు చేయకుండా ఆయనకు తాత్కాలిక భద్రతను కోర్టు గత శుక్రవారం వరకు పొడిగించింది. ఐ ఎన్ ఎక్స్ మీడియా కేసులో సీబీఐ.. బ్రిటన్, మారిషస్, సింగపూర్, బెర్ముడా, స్విట్జ్రర్లాండ్ దేశాలకు లెటర్ రొగేటరీలను పంపిన సంగతి విదితమే. తద్వారా ఈ కేసులో ఓ విదేశీ కోర్టు సాయాన్ని కోరేందుకు వీలయింది. అయితే ఆ యా దేశాల నుంచి ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. అటు-తన క్లయింటు (చిదంబరం) కేసు విషయంలో ఈడీ, సీబీఐ సమర్పించిన ఆధారాలకు విశ్వసనీయత లేదని, సంబంధిత డాక్యుమెంట్ల గురించి ఆయనకు ఏమీ తెలియదని చిదంబరం తరఫు లాయర్ కపిల్ సిబాల్ వాదించారు. కేసు డైరీలను సాక్ష్యాలుగా ఎలా పరిగణిస్తారని ఆయన ప్రశ్నించారు. కౌంటర్ అఫిడవిట్లు మీడియాకు లీక్ అయ్యాయన్నారు. సీబీఐ తరఫు న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ వాదనను తొసిపుచ్చ్చారు. కౌంటర్ అఫిడవిట్లు ఏవీ లీక్ కాలేదన్నారు. మీ క్లయింటుకు అందాకే అవి లీక్ అయ్యాయి అని ఆయన పేర్కొన్నారు.

అటు-సీల్డ్ కవర్లోని డాక్యుమెంట్లను లంచ్ టైం లో పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది. దీన్ని కపిల్ సిబాల్ వ్యతిరేకిస్తూ.. దర్యాప్తు సంస్థలు ఈ రకమైన డాక్యుమెంట్లను సమర్పిస్తాయనడానికి చట్టమేదీ లేదన్నారు. మరోవైపు-రిమాండ్ ఆర్థర్ ను సోమవారానికి లిస్ట్ చేయలేదని కోర్టు పేర్కొంది. చీఫ్ జస్టిస్ రంజిత్ గొగోయ్ నిర్ణయం తీసుకున్న అనంతరమే ఈ ఆర్డర్ ను రిజిస్ట్రీ చేస్తారని వివరించింది. అటు-ఈడీ, సీబీఐ ఈ కేసును హ్యాండిల్ చేస్తున్న తీరును సిబాల్ ప్రశ్నిస్తూ.. అసలు మీకు ట్విటర్ ఖాతా ఉందా.. మీ ఇంటరాగేషన్‌ నాణ్యత ఇలా ఉందేమిటి అన్నారు. . విచారణ సందర్భంగా చిదంబరాన్ని సీబీఐ ఈడీ, మీకు ట్విటర్ అకౌంట్ ఉందా అని ప్రశ్నించడమేమిటని అన్నారు. అటు- చిదంబరం… తన కుమారుడు కార్తీని ‘ బాగా చూసుకోవాలంటూ ‘ ఐ ఎన్ ఎక్స్ మీడియా మాజీ బాసులైన పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీలను కోరిన మాట వాస్తవం కాదా అని తుషార్ మెహతా ప్రశ్నించారు. షెల్ కంపెనీల పేరిట చిదంబరానికి ఇండియాలోనూ, విదేశాల్లోనూ ఎన్నో ఆస్తులు ఉన్నాయన్నారు. ఇంద్రాణి ముఖర్జీ స్టేట్ మెంటును సీబీఐ రికార్డు చేసిందని, విచారణ సందర్భంగా కోర్టు దాన్ని పరిశీలించవచ్చునని ఆయన అన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu