పార్ట్‌ టైం రాజకీయం.. ఫుల్‌ టైం దందా..!

పాత సినిమాల్లో హీరో రాత్రింబవళ్లు రిక్షా తొక్కి, చెమటలు చిందించి కోటీశ్వరుడైపోతాడు ! రేవంత్‌ ఆ టైప్‌ కాదు. అతనిది నడమంత్రపు సిరి. అందరి చెమట కష్టాన్ని దోచుకుంటే వచ్చింది. ఒక సాధారణ పెయింటర్‌ పొలిటీషియన్‌గా

పార్ట్‌ టైం రాజకీయం.. ఫుల్‌ టైం దందా..!
Revanth Reddy
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2020 | 7:45 PM

పాత సినిమాల్లో హీరో రాత్రింబవళ్లు రిక్షా తొక్కి, చెమటలు చిందించి కోటీశ్వరుడైపోతాడు ! రేవంత్‌ ఆ టైప్‌ కాదు. అతనిది నడమంత్రపు సిరి. అందరి చెమట కష్టాన్ని దోచుకుంటే వచ్చింది. ఒక సాధారణ పెయింటర్‌ పొలిటీషియన్‌గా ఎదగడం వెనుక పెద్ద కథే ఉంది. కబ్జాలు, కుట్రలు మొదలుకొని సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, వసూళ్లు.. అబ్బో రేవంత్‌ అవినీతి బండారం అంత చిన్నదేమీ కాదు. రోజుల తరబడి చెప్పినా కబ్జాల కథ పూర్తయ్యేది కాదు !

రేవంత్‌ రెడ్డి… ఎప్పుడూ హడావుడి చేస్తూ… ఎగిరెగిరి పడుతూ కన్పిస్తారు. తానో పెద్ద లీడర్‌నని, తనపై ఫోకస్‌ పెట్టండ్రా బాబూ అన్నట్లు బిహేవ్‌ చేస్తుంటారు. రేవంత్‌ ఓ చోటా లీడర్‌. నిజానికి అది కూడా పెద్ద పదమే ! సాధారణ పెయింటర్‌గా జీవితం మొదలు పెట్టిన రేవంత్‌ ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. అంటే ఎంతో కష్టపడి పైకొచ్చారని అనుకుంటే పొరపాటు ! ఇదే సినిమా కాదు. రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోడానికి ! నిజానికి జీరో నుంచి ఈ స్థాయికి చేరుకునేందుకు రేవంత్‌ బాగానే కష్టపడ్డారు. ఆ కష్టమంతా కబ్జాలు, సెటిల్‌మెంట్లు, వసూళ్లలో చూపించారు.

తొలినాళ్లలో రేవంత్‌రెడ్డి వనపర్తిలో మామూలు పెయింటర్‌. దుకాణాలు బోర్డులు, గోడలపై ప్రకటనలు చేయడమే పని. అదే టైంలో ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకి బ్యానర్లు రాసే కాంట్రాక్టు దక్కడంతో లైఫ్‌ టర్న్‌ తిరిగింది. మకాం హైదరాబాద్‌లోని నారాయణగూడకు మారింది. అప్పటి నుంచి పొలిటికల్‌ పరిచయాలు పెరిగాయి. కేంద్ర మాజీ మంత్రి సోదరుడి కుమార్తెతో ప్రేమ వివాహం తర్వాత కథ మారిపోయింది. మిడ్జిల్‌లో జెడ్పీటీసీ సభ్యుడిగా టీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికై, ఆ తరువాత ఎమ్మెల్సీ గిరీ దక్కించుకున్నారు. తదుపరి టీడీపీలో చేరడం…ఎమ్మెల్యే కావడం.. ఓటుకు నోటు కథల వ్యవహారం అందరికీ తెలిసిందే !

ఇదంతా జస్ట్‌ ట్రైలర్‌.. రేవంత్‌ అవినీతి కథ చాలా పెద్దదే ఉంది. అందుకే రేవంత్‌ను పార్ట్‌ టైం పొలిటీషియన్‌ అనేది. అది జస్ట్‌ ఓ ముసుగు మాత్రమే ! దీన్ని అడ్డం పెట్టుకుని కన్పించిన చోటు కబ్జా చేయడం, బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడడం, సెటిల్‌మెంట్‌లు, వసూళ్లు… అబ్బో చాలానే ఉన్నాయి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ పోలీస్ స్టేషన్లలోనూ రేవంత్‌పై ఏవో ఒక కేసులు కూడా ఉన్నాయి. తిమ్మిని బమ్మిని చేసి… తానో క్లీన్‌ ఇమేజున్న లీడర్‌లా కవరింగ్‌ ఇస్తూ బతికేస్తున్నారు రేవంత్‌.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు